కడప ప్రతినిధి/యంత్రాంగం
కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రంలోని బిజెపి సర్కారు సమాధి కట్టింది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో అప్పటి యుపిఎ-2 సర్కారు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనే ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి సర్కారు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబం ధించి పలురకాల సర్వేలు, టాస్క్‌ఫోర్స్‌ల పేరుతో అధ్యయ నాలు చేయించింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మంగ ళవారం పార్లమెంటులో టిడిపికి చెందిన ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి నిత్యా నందరారు సర్వే సంస్థలు లాభసాటి కాదని తేల్చాయని, ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడం కుదరదని కుండబద్దలు కొట్టినట్లు సమాధానం చెప్పడం విస్మయాన్ని కలిగించింది. ఉమ్మడి రాష్ట్ర హయాంలో ప్రయివేటు రంగంలో బ్రహ్మణీ పేరుతో ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. వివిధ రకాల కారణాలతో బ్రహ్మణీ ఉక్కు పరిశ్రమ నిలిచిపోయింది. రాష్ట్రంలో నాయకత్వ బాధ్యతలు మారడంతో బ్రహ్మణీ పరిశ్రమ కథ కంచికి చేరింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర విభజన హామీలు, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రధానాంశాలుగా మారడం తెలిసిందే. అప్పటి టిడిపి సర్కారు నిర్లక్ష్యం వెరసి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో వైసిపి సర్కారు అధికారంలోకి వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు వైసిపి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కసరత్తు చేశారు. ఇందులోభాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రముఖ ఉక్కు దిగ్గజ సంస్థ జెఎస్‌డబ్య్లు ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కాగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిపిఎం పిలుప ునిచ్చింది.
స్పందించని వైసిపి, టిడిపి, జనసేన
కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష పార్టీలు టిడిపి, జనసేనలు స్పందించకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఉమ్మడిగా కూడబలుక్కుని తోడుదొంగలుగా మారినట్లు ప్రవర్తించడం శోచనీయం. ప్రతిపక్ష పార్టీలైన టిడిపి, జనసేనలు ప్రజల తరుపున నిలబడకుండా మోడీ, అమిత్‌షా, గుజరాతీ వ్యాపారుల పక్షాన నిలబడడం ఆందోళనకరం.
కార్పొరేట్లకు కట్టబెట్టడమే లక్ష్యమా
దేశంలోని ప్రయివేటు, కార్పొరేట్లకు లాభసాటిగా కనిపించిన ఇనుప ఖనిజం ఎగుమతులు, ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, కార్యకలాపాలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెయిల్‌కు ఎందుకు లాభసాటిగా కనిపించడం లేదనే చర్చ నడుస్తోంది. కేంద్రంలో బిజెపి పభుత్వం ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంపై చిన్నచూపు చూస్తోందనే విమర్శ పెద్దఎత్తున వినిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి సర్కారు ద్రోహపూరిత వైఖరి పట్ల ప్రజానీకం అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు.కేంద్రం పచ్చి అబద్దాల కోరు
కేంద్రంలోని బిజెపి సర్కారు సెయిల్ ఆధ్వర్యంలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఫీజుల బులిటీ లేదనడం పచ్చి అబద్దం. ఐరన్‌ఓర్‌తోపాటు ఉక్కు తయారీలో కీలక పాత్ర పోషించే సున్నం, నికెల్, డోలమైట్ వంటి కీలక మూలకాలు సైతం జిల్లాలో లభ్యమవుతుంది. దేశంలో ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో ఐరన్‌ఓర్ లేదు. కలకత్తాలోని బిలారు ఉక్కు కర్మాగారం సమీపంలోనూ ఐరన్‌ఓర్ లేదు. ఫీజుబులిటీ లేకపోతే విశాఖ మొదలుకుని బ్రహ్మణీ, జెఎస్‌డబ్ల్యూలకు ఎలా లాభాలు వస్తాయని నిర్మాణాలు చేపట్టారో ప్రజానీకం అర్థం చేసుకోవాలి. కేంద్రం తరుపున ఎవరైనా డిబేట్‌కు వస్తే సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. జిల్లాలో మొదటి గ్రేడ్ ఐరన్‌ఓర్ 75 నుంచి 70, 40 రకాలుగా గ్రేడ్ క్వాలిటీ వరకు లభిస్తోంది.
- బి.నారాయణ, ఉక్కు సాధన కమిటీ కన్వీనర్, కడప.
ఇది ఒక మోసపూరిత ఎత్తుగడ
కడపలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి వయబులిటీ లేదనడం ఓ మోసపూరిత ఎత్తు గడ. జపాన్‌లో బిగ్‌హెడ్స్ (ఉక్కు గనులు) లేకపోయినప్పటికీ ఓబు ళాపురం ఐరన్ ఓర్‌ను తీసుకుని క్వాలిటీ ఐరన్ ఉత్పత్తులు చేయడం జరుగుతోంది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేమని చెప్పడం దారుణం. రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేనలు రాష్ట్ర ప్రజల వైపా, మోడీ, షా, గుజరాతీ వ్యాపారుల వైపా అనేది తేల్చుకోవాలి. కేంద్ర మోసపూరిత వైఖరికి నిరసనగా రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నాం.
- చలసాని శ్రీనివాస్, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కన్వీనర్, విజయవాడ.
తీరని ద్రోహం
కడపలో స్టీల్ ప్లాంట్‌కు ఇప్పటిదాకా ముగ్గురు ముఖ్య మంత్రులు నాలుగుసార్లు శంకు స్థాపనలు, భూమి పూజలు చేశారు. యుపిఎ, ఎన్‌డిఎ రెండూ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్న విభజన హామీని నెరవేర్చకుండా జిల్లాను మోసం చేశాయి. కేంద్రం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదంటోంది. పర్యావరణ అనుమతులు ఇవ్వడం లేదు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అన్ని రాజకీయ పార్టీల హామీ, దాన్ని సాకారం చేయడం విభజనవాదుల అందరి బాధ్యత. జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకపోతే కేంద్రం లోని ఎన్‌డిఎ ప్రభుత్వం మాత్రం తగిన మూల్యం చెల్లించక తప్పదు.
-ఎ.రఘునాథరెడ్డి, కడప
ఎపి పట్ల చిన్నచూపే
మొదటి నుంచి కేంద్రంలోని బిజెపి సర్కారుకు రాష్ట్రం పట్ల చిన్నచూపు చూస్తోంది. కడపలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం పట్ల చిత్తశుద్ధి లేకపోవడమే కారణం. రాయలసీమ డిక్లరేషన్ పేరుతో చెప్పిన మాటలు గాలికి పోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇటీవల పురంధేశ్వరి సైతం మోసపూరిత మాటలే మాట్లాడడం ఆందోళనకరం. పార్లమెంటులో చెప్పిన మాట లకే విలువ లేకుండా పోయింది. ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఎటువంటి ముడిసరుకులు లేకపోయినా ఏర్పాటు చేసి, అన్ని వనరులు కలిగిన కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయకపోవడం శోచనీయం.
- సి.హెచ్.చంద్రశేఖర్‌రెడ్డి, కార్మిక, కర్షక ఉద్యమ నాయకులు, కడప.
ఫీజుబులిటీ పేరుతో ద్రోహం
రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చే అవకాశం కలిగిన ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ఫీజుబులిటీ లేదనే పేరుతో కేంద్రంలోని బిజెపి సర్కారు ద్రోహం చేస్తోంది. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రధాన హామీకి నిలువునా తూట్లు పొడిచింది. దేశంలో ఐరన్‌ఓర్ లభ్యతకు వందలాది కిలోమీటర్ల దూరంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం లాభదాయకమైనది. ఐరన్ ఓర్‌తోపాటు నికెల్, డోలమైట్ ఇతర ఖనిజాలు కలిగిన ప్రాంతంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడానికి వయబులిటీ కాదనడం దారుణం.
జి.చంద్రశేఖర్, సిపిఎం, జిల్లా కార్యదర్శి, కడప.
చావు కబురు చల్లగా..
కడప ఉక్కు కర్మా గారంపై కేంద్రం వాలకం చావు కబ ురు చల్లగా చెప్పినట్లు ఉంది. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నెలకొ ల్పేందుకు అన్ని హంగులతో పాటు వనరులు సమృద్ధిగా ఉన్నాయి. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి పాలనలో కడప ఉక్కు కర్మా గారం బుట్టదాఖలైందని. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, షెడ్యూల్డ్ 13 ప్రకారం కేంద్ర ప్రభుత్వం కడప జిల్లాలో సెల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం 6నెలల లోపు నిర్మించాల్సి ఉంది. తొమ్మిదిన్నర సంవత్సరాలైన అతీగతి లేదు. రాష్ట్రానికి బిజెపి ఒక శనిగ్రహం లాగా దాపురించిందని చెప్పారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కూడా ఉక్కు కర్మాగారంపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
- ఎన్.తులసిరెడ్డి, పిసిసి మీడియా చైర్మన్, కడప.రాయలసీమకు ద్రోహం చేసిన బిజెపి
కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపించలేమని కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రకటించి రాయ లసీమకు ద్రోహం చేసింది. విభజన చట్టంలో భాగంగా రా యలసీమ అభివద్ధికి ప్రత్యేక నిధులు, కడపలో ఉక్కు పరిశ్రమ, కేంద్రీయ విశ్వవిద్యాలయం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు స్థాపిం చాల్సి ఉంది. బిజెపి ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలుగా వీటిని అమలు చేయకుండా రాయలసీమకు తీరని ద్రోహం చేసింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా పార్లమెంటులో ప్రకటన చేస్తుంటే రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార, ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు మాట్లాడకుండా కూర్చోవడం బిజెపికి సాగిలపడటమే.
- పి.శ్రీనివాసులు, సిపిఎం జిల్లా కార్యదర్శి, అన్నమయ్య.
ప్రజలు తగిన బుద్ధి చెబుతారు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో అత్యంత వెను కబడిన కడప జిల్లాలో విభజన హామీ మేరకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని పార్లమెంటులో నాయకులు బల్ల బుద్ధి చెప్పారు. అధికారంలోనికి వచ్చి 9 సంవ త్సరాల అవుతున్న స్టీల్ ప్లాంట్‌పై స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. కేంద్ర సహాయ మంత్రి కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయము అని ప్రకటించడం ప్రజలను మోసగించడమే. తగిన సమయంలో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారు.
- సయ్యద్ సలావుద్ధీన్, సంఘ సేవకలు, కడప.
విభజన హామీలకు తిలోదకాలు
ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం జిల్లావ్యాప్తంగా పార్టీలకతీతంగా ప్రజలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున సాగించిన పోరాటానికి నాటి యుపిఎ ప్రభుత్వం కడప ఉక్కు పరిశ్రమ రాష్ట్ర విభజన చట్టంలో చేర్చింది. అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం విభజన హామీలకు తిలోదకాలు ఇచ్చింది. ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కువ పార్లమెంట్ స్థానాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కడప ఉక్కు పరిశ్రమ తీసుకువస్తామన్నారు. స్వార్థ రాజకీ యాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారు. ఉక్కు పరిశ్రమ స్థాపనకు అవస రమైన మౌలిక వసతులు కేంద్రానికి కనిపించకపోవడం దుర్మార్గం
-చంద్ర, జిల్లా కార్యదర్శి, సిపిఐ, కడప.










