సెయిల్ ఆధ్వర్యంలో - డివైఎఫ్‌ఐ జిల్లా మాజీ కార్యదర్శి బి.మనోహర్ డిమాండ్
కడప అర్బన్ : జిల్లాలో స్టీల్‌ప్లాంటు సాంకేతికంగా, ఆర్థికంగా లాభదాయకం కాదని కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర ప్రజలను మోస గించడమే అని భారత ప్రజాతంత్ర యు వజన సమైక్య డివైఎఫ్‌ఐ జిల్లా మాజీ కార్యదర్శి బి. మనోహర్, నగర కార్యదర్శి డి. ఎం. ఓబులేసు అన్నారు. గురువారం పాత బస్టాండ్‌లోని పూలే సర్కిల్లో డివైఎఫ్‌ఐ నగర్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడపలో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా కార్మాగారం నిర్మిస్తుందంటూ ఆర్భాటంగా శంఖుస్థాపన చేసినప్పటికీ ఇప్పటికీ దానికి అతీగతీ లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా పార్ల మెంటులో ప్రకటన చేస్తుంటే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార, ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు మారు మాట్లాడకుండా కూర్చోవడం విడ్డూరమని వాపోయారు. కడప ఉక్కు పరిశ్రమపై కేంద్రం మోసకారితనం బట్టబయలైందని తెలిపారు. పార్లమెంటులో కేంద్ర హోమ్ సహాయ మంత్రి ప్రకటన డివైఎఫ్‌ఐ ఖం డిస్తుందన్నారు. కడప ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదన్నా కేంద్రం ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2014 పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర విభజన చట్టంలో దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో కడప జిల్లా ఒకటని, ఆ ప్రాంత ప్రజల అభివద్ధికి ఉక్కు పరిశ్రమ దోహదపడుతుందని చిలక పలుకులు పలికి, ఇప్పుడు తిరిగి పార్లమె ంటులోనే అది సాధ్యం కాదని చెప్పడం సమంజసం కాదన్నారు. ఇది రాయల సీమ ప్రజలను తీవ్రంగా నయా వంచన గురి చేయడమేనని విమర్శించారు. నిత్యం వలసలు, ఆత్మహత్యలు, కరువు తో అలా ్లడుతున్న సీమ కు ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష ఉద్యోగాలు వస్తాయని, నిరుద్యోగ యువతీ, యువకులు ఎదురుచూస్తూ ఉంటే వారి ఆశలపై బిజెపి ప్రభుత్వం నీళ్లు చల్లిందని మండిపడ్డారు. కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిన బిజెపి తమ బాధ్యతనుంచి తప్పించుకోవడం సరికాదన్నారు. తక్షణమే బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ మాజీ జిల్లా నాయకులు అన్వేష్, దస్తగిరి రెడ్డి, చంద్రా రడ్డి, పాపిరెడ్డి, రామకష్ణారెడ్డి, నగర ఉపా ధ్యక్షులు విజరు, నాయకులు ఉదరు, ఇమామ్, ప్రభాకర్ పాల్గొన్నారు. బద్వేలు : కడప ఉక్కు పై కేంద్ర ప్రభుత్వం మరోమారు యువతను మోసం చేసిం దని, కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల విద్యా ర్థులు, యువకులు పోరాటాలకు నాంది పలకాలని అలాగే రాష్ట్రానికి సంబం ధించినటువంటి ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వంపై ఉక్కు పరిశ్రమ కోసం పోరాటాలు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్‌ఐ జిల్లా అద్యక్షులు ముడియం చిన్ని అన్నారు. గురువారం స్థానిక డివైఎఫ్‌ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్, గంగనపల్లి నాగార్జున, మహిళ కన్వీనర్ సి గురుదేవి , ఉపాధ్యక్షులు సురేంద్ర, సురేష్, సహాయ కార్యదర్శులు ఆంజనేయులు, గురయ్యా, సుబ్రహ్మణ్యం, సిద్దయ్య పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్ : కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం సాధ్యం కాదని పార్లమెంటులో చెప్పడాన్ని డివైఎఫ్‌ఐ తీవ్రంగా ఖండిస్తోందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక పాత బస్టాండ్ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శివ కుమార్ మాట్లాడుతూ కడప ఉక్కు ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అన్నారు. విభజన చట్టంలో స్పష్టంగా కడపకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అని ఉన్నా కేంద్రంలోని బిజెపి ఇంత వరకు ఏర్పాటు చేయలేదన్నారు. పార్లమెంటు సాక్షిగా కడపకు ఉక్కు ఏర్పాటు చేస్తామని నాడు చెప్పి, బిజెపి నేడు అది సాధ్యం కాదని కేంద్ర సహాయ మంత్రి చెప్పడం ఘోరమన్నారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు సైతం పార్లమెంటులో కడప ఉక్కుపై కేంద్రాన్ని నిలదీయలేక పోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా పాలకవర్గ పార్టీలు ఇక్కడి ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి, సూరి, రాఘవ, సురేంద్ర, అరుణ్, సుభహన్ పాల్గొన్నారు.










