Oct 21,2023 21:12

ప్రజాశక్తి - యలమంచిలి 
            ఇటీవల మృతి చెందిన చించినాడ గ్రామానికి చెందిన సిపిఎం సానుభూతిపరుడు శెట్టిమి బాబూరావు కుటుంబాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, పార్టీ మండల కార్యదర్శి కె.బాలరాజు, సిఐటియు మండల కార్యదర్శి దేవ సుధాకర్‌తో కలిసి పరామర్శించారు. బాబూరావు భార్య మరియమ్మ, సోదరుడు, మరదలు భాస్కరరావు, మణిలను పరామర్శించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ బాబూరావు చించినాడ పోరాటంలో పాల్గొన్నారన్నారు. సిపిఎం నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారన్నారు. సిపిఎం నిర్వహించిన అనేక బహిరంగ సభల్లో ఉద్యమ పాటలకు డప్పు దరువు వేస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరిచేవారన్నారు. వారితో పాటు సిపిఎం నాయకులు స్టాలిన్‌, వెంకటస్వామి, డివైఎఫ్‌ఐ నాయకులు పద్మరాజ్‌, జున్ను, జయరాజ్‌, సంతోష్‌, ప్రభుదేవా పాల్గొన్నారు.