Aug 10,2023 22:13

మాట్లాడుతున్న జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

* రాజీ మార్గమే రాజ మార్గం
* జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా
ప్రజాశక్తి - శ్రీకాకుళం: 
సెప్టెంబర్‌ 9వ తేదీన జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా తెలిపారు.జిల్లా కోర్టులోని జిల్లా జడ్జి ఛాంబరులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీ మార్గమే రాజ మార్గమన్నారు. ఈ విషయాన్ని కక్షిదారులు గ్రహించి కేసులు రాజీ చేసుకోవాలని సూచించారు. సుమారు ఏడు వేల కేసులు రాజీకి సంబంధించినవిగా గుర్తించామన్నారు. జాతీయ లోక్‌అదాలత్‌కు సంబంధించి అందరికీ ముందస్తు సమాచారం అందించామన్నారు. లోక్‌అదాలత్‌ ఉద్దేశాన్ని కక్షిదారులకు విస్తృతస్థాయిలో వివరించామని అన్నారు. పలు ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాసంఘాలు, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు లోక్‌అదాలత్‌ విజయవంతానికి సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. జిల్లాలో వాహన ప్రమాద కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, వాటి పరిష్కారానికి ముందుకు రావాలన్నారు. ప్రతి కక్షిదారుడు జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.