
ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సెపక్‌తక్రా బాలబాలికల జట్ల ఎంపికలు చేపట్టారు. అండర్-14, అండర్-17 విభాగాల్లో మండలంలోని గుడిపూడి జెడ్‌పి పాఠశాలలో మంగళవారం నిర్వహించిన పోటీల్లో సెలక్షన్ కమిటీ సభ్యులుగా లాకు పిచ్చయ్య, బి.అనిల్ దత్త నాయక్, జె.రమణమ్మ, కె.సునీత, కె.శశికళ వ్యవహరించారు. ఎంపికైన వారు త్వరలో నిర్వహించే 67వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొంటారని సభ్యులు తెలిపారు. ఎంపికలను హెచ్‌ఎం టి.సోమనాథ్, కె.వెంక ట్రావు, పిఇటిలు సి.హెచ్.సుధారాణి, ఎం.నరసింహా రావు, బి.తులసిరామ్ నాయక్ పర్యవేక్షించారు.
అండర్-14 బాలుర జట్టు : బి.అనిల్ కుమార్, పి.నవీన్, బి.నాని, ఎం.ప్రభుదాసు, డి.జాన్సన్, స్టాండ్‌బై... టి.మనోహర్, కె.సామ్యూల్‌రాజు,
అండర్-14 బాలికల జట్టు : షేక్ మెహరున్నీసా, కె.వర్షిత, డి.దివ్య, టి.నాగసాయి మహేశ్వరి, డి.హరిప్రియ
అండర్-17 బాలుర జట్టు : బి.నిరీక్షణ బాబు, పి.గోపీచంద్, పి.తేజ, ఎం.విజయ ఆనంద్, పి.శౌరికిరణ్, స్టాండ్ బై... కె.ప్రేమరాజు, కె.అశోక్
అండర్-17 బాలికల జట్టు : కె.జ్యోతి, ఎ.చంద్ర మానస, ఎస్.సునీత, ఎ.అభిలాషిక, బి.దుర్గా మహేశ్వరి, స్టాండ్ బై... ఎన్.వెంకట రవళి, షేక్ సుహానా ఎంపికయ్యారు.