తుళ్లూరు: రాజధాని అమరావతిలోని విఐటి విశ్వవిద్యాలయంలో ఐడిఎస్ (ఇన్ఫర్మేషన్ డేటా సిస్టమ్స్) సహకారంతో బుద వారం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ బ్లాక్ చెయిన్‌ను ప్రారం భించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విఐటి ఫౌండర్, ఛాన్సలర్ డాక్టర్ జి. విశ్వ నాథన్, ఇన్ఫర్మేషన్ డేటా సిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ వోరుగంటి, ఇన్ఫర్మేషన్ డేటా సిస్టమ్స్ బిజినెస్ హెడ్ సునీల్ యడవల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వనాథన్ మాట్లాడుతూ, ఇన్ఫర్మేషన్ డేటా సిస్టమ్స్ సహకారంతో బ్లాక్ చెయిన్‌లో భారత దేశంలోనే మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను రాజ ధాని అమరావతి లోని విఐటి విశ్వవిద్యాలయంలో స్థాపిం చడం ఆనందంగా ఉందని అన్నారు.సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్‌ను విద్యార్థులు, అధ్యాపకులు సద్వినియోగం చేసుకొని బ్లాక్ చైన్ టెక్నాలజీ రంగంలో నైపుణ్యాలను పెంచు కోవాలని కోరారు. అరవింద్ మాట్లాడుతూ,విఐటి విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా భారత్ బ్లాక్ చైన్ యూనివర్సిటీ ఇండిస్టీ క్లస్టర్ (యుఐసి)లో భాగంగా 5 అప్లైడ్ బ్లాక్ చైన్ సెంటర్‌లలో ఒకటని తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ల్యాబ్, విద్యా ర్థులు, అధ్యాపకులకు ఆచరణాత్మకంగా,హెడెరా హ్యాష్‌గ్రాఫ్ వినియోగ కేసులను ఉపయోగించి నూతన ఆవిష్కరణలకు వీలు కల్పిస్తుందని చెప్పారు. విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్‌వి కోటారెడ్డి మాట్లా డుతూ, విఐటి -ఏపి విశ్వవిద్యాలయం పరి శోధనలలో ఎల్లప్పుడూ ముందు ఉంటుందని అన్నారు. సునీల్ యడ వల్లి మాట్లాడుతూ, తాను విఐటి పూర్వ విద్యార్థినని ఈ సందర్బంగా గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో రమణి బాలసుందరం (ట్రస్టీ, విఐటి-భోపాల్ ), రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి డాక్టర్ ప్రదీప్ రెడ్డి(డీన్,స్కోప్), డాక్టర్ ప్రభా సెల్వరాజ్ (చైర్ ప్రొఫెసర్ అఫ్ బ్లాక్ చైన్ సిఓఈ ) పాల్గొన్నారు.
కెఎల్ యు ను సందర్శించిన డాక్టర్ నాగభూషణ్
తాడేపల్లి రూరల్: కెఎల్ యు డీమ్డ్ యూనివర్శిటీని విజ్ఞాన్ యూనిర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ నాగభూషణ్ బుదవారం సంద ర్శించారు. వర్శిటీలో గత మూడు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ కార్యశాలలో పాల్గొనేందుకుగాను వచ్చిన ఆయన మానవ మెదడులె తలెత్తే సమస్యల యొక్క డేటాను ఎలా అర్ధం చేసుకోవాలి, దానికి కంప్యూటర్ ఆల్గా రిథమ్‌ను ఎలా అన్వయించాలనే అంశంపె విద్యార్థులకు వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మందికి మెద డుకు సంబంధించిన వ్యాధులు సోకే ప్రమాదం ఉంద న్నారు. ఆ సమయానికి మెదడు సమస్యలను త్వరితగతిన గుర్తించడానికి అధునాతన టెక్నాలజీ అవసరమన్నారు. ఈ నేపధ్యంలో కెఎల్ యు అధ్వర్యంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ప్రోత్సాహంతో జరుగుతున్న అంతర్జాతీయ కార్యశాల ఎంతో అవసరమన్నారు. అనంతరం కెఎల్ యు ప్రో ఛాన్సలర్ డాక్టర్ కెఎస్.జగన్నాథరావు, పరిశోధనలు, అభివద్ది డీన్ డాక్టర్ జయకుమార్ సింగ్ లు నాగభూషణ్ ను ఘనంగా సత్క రించారు. వర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ జి.పార్ధసారథి వర్మ, ప్రో వైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఎవిఎస్.ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్ రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు పాల్గొన్నారు.










