ఇంటికి వెళుతున్న విద్యార్థులు
ప్రజాశక్తి-పాడేరు టౌన్: కళాశాలలకు, పాఠశాలలకు గురువారం నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో ఏజెన్సీలో చదువుతున్న గిరిజన విద్యార్థులు ఇళ్లకు పయనమవుతున్నారు. బుధవారం విద్యార్థులు తరగతులు ముగించుకొని ఉల్లాసంగా వెళ్లారు. తల్లిదం డ్రులు వసతి గృహాలకు చేరుకుని లగేజీతో సహా పిల్లలను తీసుకెళ్లారు. దీంతో గురువారం పాడేరు పట్టణం లో ఎటు చూసినా తమ పిల్లలను ఇళ్లకు తీసుకు వెళుతున్న సందడి నెలకొంది. తమ తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామాలకు వెళ్తుండటంతో పట్టణంలోని రోడ్లు, ఆర్‌టిసి కాంప్లెక్స్, తదితర ప్రాంతాలు కిటకిటలాడాయి.










