Nov 05,2023 23:04

విద్యార్థులను ఇళ్లకు పంపిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

* అడ్డుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
నగరంలోని 80 అడుగుల రోడ్డులో గల నారాయణ జూనియర్‌ కళాశాలలో ఆదివారం రోజు విద్యార్థులకు తరగతులు నిర్వహించింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎం.సంతోష్‌, కె.కార్తీక్‌ కళాశాలకు వెళ్లి యాజమాన్య ప్రతినిధులతో మాట్లాడారు. సెలవు రోజుల్లో తరగతులను నిర్వహించడం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించేడమేనన్నారు. సెలవు రోజున తరగతుల నిర్వహణ వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారని వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇంటర్‌ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులను ఇళ్లకు పంపించారు.