
ప్రజాశక్తి- కంచికచర్ల: సెలవు దినాల్లో తరగుతులు నిర్వహించే ప్రయివేట్ పాఠశాలు,కళాశాలు పై చర్యలు తీసుకొని వాటి గుర్తింపు రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల ప్రధాన కార్యదర్శి ఎస్. కె జాహిదా డిమాండ్ చేశారు.గాంధీ జయంతి సందర్భంగా సోమవారం కంచికచర్ల మండల కేంద్రంలోని పలు ప్రయివేట్,కళాశాలు పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తున్నా సమాచారంతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పలు పాఠశాలల,కళాశాలు వద్ద తనిఖీలు చేశారు. ఆ సందర్భంలో కొంత మేర ఆందోళన చేపట్టారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి అక్రమంగా ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఎం.ఇ.ఒ, ఆర్.ఐ.ఓ తెలిసీతెలియనట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించే విద్యాసంస్థలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికే పలు మార్లు అధికారుల దష్టికి తీసుకొని వెళ్లిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె చెప్పారు. విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోతే మండల విద్యా కేంద్రాన్ని ముట్టడి చేయడాన్ని తెలియజేశారు. పరిష్కారం కోసం జిల్లా అధికారులను ఫోన్ ద్వారా సమస్యను వివరించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మండల అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు.