Sep 30,2022 23:10

స్థలపరిశీలన చేస్తున్న బిఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులతో మహేష్‌

ప్రజాశక్తి -ఆనందపురం : మండలంలోని దబ్బంద, గోరంట్ల, రామవరం, భీమన్న దొరపాలెం, ముచ్చెర్ల, తంగుడుబిల్లి తదితర గ్రామాల్లో ప్రజల సెల్‌సిగల్స్‌ లేక పడుతున్న అవస్థలపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు శుక్రవారం బిఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు, నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి ముత్తంశెట్టి మహేష్‌ ఆయా గ్రామాల్లో పర్యటించి, స్థల పరిశీలన చేశారు. ఆయా ప్రాంతాల్లో బిఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌టవర్‌ ఏర్పాటుకు అనువైన స్థలానికి పరిశీలన జరిపారు. త్వరలోనే సెల్‌టవర్‌ నిర్మాణం చేపడతామని బిఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ డిజిఎం శ్రీనివాసరావు, ఎజిఎం శ్రీకాంత్‌, ఎస్‌డిఇ జివి.సతీష్‌, ఎంపిటిసి కృష్ణ, సర్పంచ్‌ బంటు చిన్న, వైసిపి నేతలు కాకర్లపుడి శ్రీకాంత్‌రాజు, వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ మజ్జి వెంకటరావు, గండ్రెడ్డి శ్రీనివాసరావు, లెంక రాంబాబు, వైస్‌ ఎంపిపి పాండ్రంకి శ్రీను, డోల దేముడు, బలిరెడ్డి మహేష్‌, జీనాల రమణ, సియాద్రి పరదేశి పాల్గొన్నారు.