ప్రజాశక్తి - ఆస్పరి
విద్యార్థులు సెల్‌ఫోన్లకు దూరంగా ఉండి పుస్తకాలకు దగ్గరవ్వాలని గ్రంథాలయ అధికారి విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. బుధవారం 56వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా నోబుల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ పాల్గొని పుస్తక పఠనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యువత, విద్యార్థులు చిన్నప్పటి నుంచే పుస్తక పఠనాన్ని అలవరుచుకోవాలని తెలిపారు. విద్యార్థులు సెల్‌ఫోన్లకు అలవాటు పడకుండా పుస్తకాలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. ఉపాధ్యాయులు రామకృష్ణ, వార్డు మెంబర్ అలీ బాష, పాఠకులు యుగంధర్, రామకృష్ణ, శివ, రంగస్వామి, గోవిందు పాల్గొన్నారు. కౌతాళం గ్రంథాలయంలో పుస్తక పఠనంతో పాటు మారకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి మధు లీల మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. పెద్దకడబూరు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. జాలవాడి మండల పరిషత్ పాఠశాలలో పదాల అంత్యాక్షరి, పద్యాల పోటీ, డ్రాయింగ్, మ్యూజికల్ చైర్స్, కథలు చెప్పడం వంటి పోటీలు నిర్వహించారు. గ్రంథాలయ అధికారి ఆశాజ్యోతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విక్టోరియామ్మ, ఉపాధ్యాయులు నాగరాజు, సుజాత, శివకుమార్ పోటీలను నిర్వహించారు.