పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-అద్దంకి: అద్దంకి మండలంలోని మణికేశ్వరంలో ఎయిర్ టెల్ సెల్ టవర్ నిర్మాణం చేపట్టవద్దని ఆ గ్రామస్తులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. సెల్ టవర్ పనులను నిలిపివేయాలని భీష్మించుకు కూర్చున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ సెల్ టవర్ నిర్మాణం వలన రేడియేషన్ ప్రభావం ఉంటుందని, అది తమ పిల్లల భవిష్యత్తుకే కాకుండా ఆరోగ్యపరంగా అనేక సమస్యలు తలెత్తుతాయని తెలియజేశారు. ఈ విషయం గురించి స్థానికులు ఆందోళనకు దిగారు. నివాస సముదాయాల మధ్య రేడియేషన్ వెదజల్లే సెల్‌టవర్ ఎలా నిర్మిస్తారంటూ స్థానికులు అడ్డం తిరిగారు. అనంతరం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కె కరీముల్లా, ఎస్‌కె బాషా, మైనారిటీ యువకులు తదితరులు పాల్గొన్నారు.










