సెల్ టవర్ నిర్మాణం పై వ్యతిరేకత
పెదకాకాని: మండలంలోని నంబూరు గ్రామంలో లైబ్రరి ఎదురు ఉన్న భవంతిపై సెల్ టవర్ నిర్మాణం పై స్థానికులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సెల్ టవర్ నుండి వెలువడే రేడియోషన్ వల్ల తమ ఆరోగ్యాలు దెబ్బతింటాయని, అనారోగ్యం పాలవుతామని అంటున్నారు. ఈ నిర్మాణానికి పక్కనే పాఠశాల ఉందని, విద్యార్థులకు కూడా ముప్పు ఉన్నప్పటికీ సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపడంలేదని, తహశీల్దార్‌కు, పంచాయతి సిబ్బందికి ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా ఫలితం లేదని ప్రజలు వాపోతున్నారు నిర్మాణంలో ఉన్న సెల్ టవర్ ఆపాలని తమ ఆరోగ్యాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.










