Jan 04,2023 00:10

సెల్‌ టవర్‌ ఏర్పాటుకు భూమి పూజ చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -సీలేరు
మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన జీకే వీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ మాదిగమల్లులో ఎయిర్‌ టెల్‌ సెల్‌ టవర్‌ నిర్మాణానికి మంగళవారం జీకే వీధి సిస అశోక్‌ కుమార్‌, సీలేరు ఎస్‌ఐ రామకృష్ణ, ఎయిర్‌ టెల్‌ మేనేజర్‌ ఎస్‌జి.ప్రసాదు ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సిఐ అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాల్లో సమాచార వ్యవస్థని అందుబాటులో తీసుకొచ్చి ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సెల్‌ టవర్‌ నిర్మాణంతో ఇంటర్నెట్‌ సెల్‌ సౌకర్యం కల్పించడానికి చొరవ చూపిన పోలీసు అధికారులకు రుణపడి ఉంటామని గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.