ప్రజాశక్తి- యు.కొత్తపల్లి ఎస్‌ఇజెడ్ పోరాట పోరాట నాయకుడు పెనుమల్లు సుబ్బిరెడ్డి అకాల మరణం సెజ్ గ్రామస్తులకు తీరని లోటని సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు డి.శేష బాబ్జి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలశెట్టి నాగేశ్వరరావు అన్నారు. సుబ్బిరెడ్డి కుటుంబ సభ్యులను సిపిఎం నాయకులు పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెజ్‌లో భూములు కోల్పోయిన రైతుల పక్షాన నిలబడి పోరాటాలు చేసిన సుబ్బిరెడ్డి సెజ్ గ్రామాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని తెలిపారు. అధికార యంత్రాంగం కేసులు బనాయించి సెంట్రల్ జైల్లో వేయించినా బాధిత రైతుల పక్షాన నిలబడి పోరాటం చేశారన్నారు. దాని ఫలితంగానే 2000 ఎకరాలను ప్రభుత్వం వెనక్కి ఇచ్చిందన్నారు. పరామర్శించిన వారిలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కె.సింహాచలం, పిఠాపురం కన్వీనర్ కె.చిన్న తదితరులు ఉన్నారు
ఎస్‌ఇజెడ్‌లో భూములు కోల్పోయిన రైతుల కోసం అండగా ఉండి పోరాట పటిమతో సెజ్ అధికారులను సుబ్బిరెడ్డి గడగడలడించారు. పోలీసుల లాఠీ దెబ్బలకు ఎదరొడ్డి నిలబడిన పెనుమల్లు సుబ్బిరెడ్డి శుక్రవారం ఉదయం అకాల మరణంతో సెజ్ బాధిత గ్రామాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సెజ్ పోరాటంలో ఆయనపై 30 కేసులు పెటాత్టరు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 140 రోజులు ఉన్నారు.










