Jul 29,2023 20:49

సమావేశంలో మాట్లాడుతున్న అధ్యక్షులు పోతుల వెంకట్రామిరెడ్డి

 కడప అర్బన్‌ లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కడప అన్నమయ్య సేవలు కొనసాగిస్తామని నూతన అధ్యక్షులుగా ఎన్నికైన పోతుల వెంకట్రామిరెడ్డి అన్నారు. శనివారం పాతబస్టాండ్‌లోని పోతుల ట్రావెల్స్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ మాట్లాడుతూ గత ఏడాది లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ అన్నమయ్యలో చేరామన్నారు. తాను చేసిన సేవా కార్యక్రమాలను చూసి ఈ ఏడాదికి అధ్యక్షులుగా చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. తనపై సభ్యులు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. కేవలం వైద్య శిబిరాలే కాకుండా విద్య, ఆరోగ్యం, అనాధలు, అభాగ్యులు, భవన కార్మికులకు చేయూతనిచ్చే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. దశలవారీగా అవసరమైన అన్ని వర్గాలకు సేవ కార్యక్రమాలను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళతామన్నారు. కార్యదర్శి కొండూరు జనార్థనరాజు మాట్లాడుతూ రాయలసీమ టూరిజం ద్వారా పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కడప అన్నమయ్యలో భాగస్వాములు అవుతున్నామని తెలిపారు. అమ్మాయిలకు క్రీడా సామగ్రీని అందిస్తామని చెప్పారు. అందరూ సహకరించాలని కోరారు. బిసి కార్పొరేషన్‌ ఇడి డాక్టర్‌ వల్లూరు బ్రహ్మయ్య మాట్లాడుతూ సమాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.