Sep 12,2023 00:01

ప్రజాశక్తి - భట్టిప్రోలు
గ్రేస్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతున్న ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి యన్నం సురేష్‌కు స్టార్ గోల్డెన్ అవార్డు రావడం అభినందనీయమని ఫౌండేషన్ అధినేత కైతేపల్లి షాలెంరాజ్ అన్నారు. స్థానిక పద్మశాలి కళ్యాణ మండపంలో సురేష్‌ను గ్రామ యువకులు ఘనంగా సత్కరించారు. సభలో గ్రేస్ ఫౌండేషన్ అధినేత షాలెంరాజు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గంలో కుల, మతాలు, పార్టీలకతీతంగా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు చేరవేటంలో సురేష్ కృషి ఎనలేనిదని అన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలతో మరెన్నో అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. అవార్డు గ్రహీత సురేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పౌండేషన్ ఇచ్చే ప్రతి పిలుపును తప్పకుండా ప్రజలకు అందచేయటంలో ముందుంటానని అన్నారు. అవార్డు రావడం తనకు మరింత బాధ్యతలు పెంచిందన్నారు. షాలెంరాజ్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు తోడుగా వేమూరు నియోజకవర్గంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మరింత మేలు జరుగుతుందని అన్నారు.  కార్యక్రమంలో న్యాయవాది దోవ రమేష్ రాంజీ, కంభం సురేష్, అనిల్, సీతయ్య, నాని ఉన్నారు.