Apr 19,2023 21:08

మంచినీటి ట్యాంకర్లను ప్రారంభిస్తున్న తులసీ రామచంద్రప్రభు

ప్రజాశక్తి-గుంటూరు : ఎన్నో సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న తులసీ రామచంద్రప్రభు సేవాతత్పరుడు అని గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌) సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న వేలాది మంది రోగులకు, వారి సహాయకులకు దాహార్తిని తీర్చటానికి, ఇతర అవసరాలకు నీటి కొరత రాకుండా, సూపరింటెండెంట్‌ విజ్ఞప్తి మేరకు రామచంద్ర ప్రభు స్పందించి, ప్రతి రోజూ రెండు ట్యాంకర్ల తాగునీటిని అందచేసే కార్యక్రమాన్ని బుధవారం జిజిహెచ్‌ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా తులసీ రామచంద్రప్రభు మాట్లాడుతూ పదేళ్లుగా గుంటూరు నగర శివారు కాలనీ వాసులకు, నీటి ఎద్దడి సమస్య ఉన్న అనేక ప్రాంతాలకు 3 ట్యాంకర్ల ద్వారా నిరంతరం తాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు డాక్టర్‌ ప్రభావతి పర్యవేక్షణలో వైద్యులు, సిబ్బంది విశేష సేవలు అందిస్తున్నారని అభినందించారు. కార్యక్ర మంలో కార్పొరేటర్‌ వై.పద్మావతి, పి.రమాదేవి, బి.మల్లిక, ఎ.హరి, ఎం.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.