ప్రజాశక్తి - తాళ్ళరేవు ప్రజా నాయకుడు, మాజీ ఎంఎల్‌ఎ దొమ్మేటి వెంకటేశ్వర్లు సేవా తత్పరుడని బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రి మల్లాడి కష్ణారావు, పలువురు వక్తలు కొనియాడారు. తాళ్లరేవు నామన వెంకాయమ్మ జెడ్‌పి పాఠశాలలో ఎఎంసి చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ అధ్యక్షతన శనివారం దొమ్మేటి వెంకటేశ్వర్లు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి వేణుగోపాలకృష్ణ, పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కష్ణారావు, ఎంపీ సుభాష్ చంద్రబోస్, ఎంఎల్‌ఎ పొన్నాడ సతీష్ కుమార్ తదితరులు పాల్గొని దొమ్మేటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల మనిషిగా పోరాట యోధునిగా వెంకటేశ్వర్లు పని చేశారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దొమ్మేటి భార్య సుబ్బలక్ష్మి, కుమార్తె స్నేహలత, జెడ్‌పిటిసిలు దొమ్మేటి సామ్యూల్ సాగర్, గుబ్బల తులసి కుమార్, నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, పితాని అన్నవరం, టేకుమూడి లక్ష్మణరావు, వాడ్రేవు వీరబాబు, కాశి లక్ష్మణస్వామి, వేగేశ్న భాస్కర రాజు, కాదా గోవింద్ కుమార్, పెట్ల సూర్యనారాయణ రాజు, నల్లి బ్రహ్మాజీ, పినపోతు కామేశ్వరరావు, పేర్ని ఆదినారాయణమూర్తి, రెడ్డి బాబు, కాలా సూరిబాబు, టి.ఈశ్వరరావు పాల్గొన్నారు.










