Nov 02,2023 22:31

ప్రజాశక్తి - దేవరపల్లి సిరిమువ్వ సోషల్‌ సర్వీస్‌ సంస్థ 26 వ వార్షికోత్సవ సభలో దేవరపల్లికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీకాకోళ్లపు కాళీ కృష్ణకు అమరజీవి పొట్టి శ్రీరాములు అభ్యుదయ విశిష్ట సేవరత్న అవార్డు అందచేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్‌ వాసవి విద్యాసంస్థల అధినేత జిఎంఆర్‌, గమిని సుబ్బారావు, సిరిమువ్వ ఆర్గనైజర్‌ పెద్దోజు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. గతంలో కాళీ కృష్ణ ఎన్‌టిఆర్‌, కీర్తి పురస్కారం, విశ్వ జనని సేవారత్న అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం జిల్లా వాసవి సేవాదళ్‌ ఛైర్మన్‌గా, పొట్టి శ్రీరాములు పరిరక్షణ కమిటి రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.