కడప ప్రతినిధి : వృత్తుల్లో నర్సింగ్ వృత్తి సర్వోత్తమమైనది. ఇటువంటి ప్రత్యేకత కలిగిన వృత్తి కావడంతోనే నైటింగేల్ మొదలుకుని మధర్‌థెరీసా వంటి ఎందరో మహితా త్ములు ప్రేమ, సేవ, దయాగుణాల కలబోతతో కూడిన అవిరళ కృషి కారణంగా చరిత్ర, ప్రసిద్ధికెక్కారు. భూ మండలం ఉనికిలో ఉన్నంత వరకు వారి పేర్లు ఆచంద్రార్కం. సమ కాలీన ప్రపంచంలో కోవిడ్-19 వంటి మహమ్మారి విజృంభించిన చేదు అనుభవాలతో నర్సింగ్ వృత్తి ప్రత్యేకత విలక్షణతను సంతరించుకుంది. ప్రతి ఇంటా ఒక నర్స్ ఉండాలనే వాతావరణాన్ని ఏర్పరించింది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాల్లో నర్సింగ్ వత్తికి అబ్బురపరిచే జీతభత్యాలతో మెరుగైన జీవన ప్రమాణాలను అందుకుంటున్నారని, దేశంలో కూడా నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వెంటనే ప్రభుత్వ, ప్రయివేటు ఆస్ప త్రుల్లోని వివిద హోదాల్లో ఉద్యోగాల్లో చేరిపోతున్న వృత్తి ఏదైనా ఉందంటే నర్సింగ్ వృత్తేనని పేర్కొంటున్న నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.హిమగిరికుమారితో ముఖాముఖి.
నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా తీసుకోవాలి?
ఏటా ఎంసెట్, నీట్ తరహాలో ఎపిసెట్ పరీక్ష ఉంటుంది. ఎపిసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకుని నిర్ణీత తేదీల్లో ప్రకటిస్తారు. ఎపిసెట్ పరీక్షలో లభించిన ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలలో సీట్లు లభిస్తాయి. ర్యాంకుల ఆధారంగా ఆయా నర్సింగ్ కళాశాలలో అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాలి.
అడ్మిషన్ల ప్రక్రియ ఎలా ఉంది?
2023-24 అకడమిక్ ఇయర్‌లో అడ్మిషన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ప్రతి ఏటా జిజిహెచ్ నర్సింగ్ కళాశాలలో 60 సీట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు మొదటి విడత కౌన్సెలింగ్‌లో 50కి పైగా సీట్లు భర్తీ చేశాం. సెకెండ్ కౌన్సెలింగ్ నడుస్తున్న నేపథ్యంలో మిగిలిన10 సీట్లు భర్తీ చేస్తాం.
నర్సింగ్ కాల వ్యవధి ఎంత. విద్యార్థుల సంఖ్య ఎంత?
నర్సింగ్ కోర్సు కాల వ్యవధి నాలుగు సంవత్సరాలు. ప్రతి ఏటా 60 మంది చొప్పున 240 మంది విద్యార్థినులు విద్యా బ్యాసంసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరుపున సుమారు 18 మంది వరకు జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన విద్యార్థినులు విద్యా బ్యాసం సాగిస్తున్నారు. వీరికి ప్రధానమంత్రి నిధుల నుంచి స్కాలర్‌షిప్పులు మంజూరు చేస్తారు. వీరందరికీ ప్రభుత్వమే హాస్టల్ సదుపాయాలను కల్పిస్తోంది.
స్టైఫండ్ వంటి సదుపాయాలు ఏమైనా ఉన్నాయా?
ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో చదివే విద్యార్థినులకు ప్రతి నెలా రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు స్టైఫండ్ మంజూరవుతోంది. స్టైఫండ్ ఆధారంగా భోజన, ఇతర కాస్మొటిక్ వంటి సదుపాయాలకు ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వ కళాశాల ఉత్తీర్ణత గురించి తెలపండి?
ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 22 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. సీనియర్ లెక్షరర్స్ కావడంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలోని ఫస్ట్ సెమిస్టర్‌లో ఫస్ట్‌క్లాస్‌లతో ఉత్తీర్ణత సాధించారు. 25 మంది డిస్ట్రిక్షన్‌లో ఉత్తీర్ణత సాధించారు. నలుగురు విద్యార్థులు వైఎస్‌ఆర్, యుహెచ్‌ఆర్ అవార్డుకు సిఫారసు చేయగా, ఒకరికి అవార్డు, సర్టిఫికెట్, రూ.10 వేల నగదు ఎంపిక కావడం గమనార్హం.
అత్యుత్తమ ఫలితాలను (డిస్ట్రిక్షన్స్) ఎలా రాబట్టగలిగారు?
ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 22 మంది డిస్ట్రిక్షన్స్, 38 మంది ఫస్ట్‌క్లాస్ వంటి అత్యుత్తమ ఫలితాలను రాబట్టడానికి ప్రత్యేక కసరత్తు చేశాం. ఛాప్టర్ల వారీగా పరీక్షలు నిర్వహించాం. ఫలితాల్లో వెనుకబడిన విద్యార్థులకు సంబంధించిన సబ్జెక్టు నిపుణులతో చర్చిం చడం, సందేహాలను తీర్చడం, ప్రాపర్ మానిటరింగ్ చేయడం వంటి విధానాలతో సమష్టి కృషి చేయడం ద్వారా అత్యుత్తమ ఫలితాలను రాబట్టగలిగాం.
నర్సింగ్ ల్యాబ్‌లు, ఇతర కృత్యాలను వివరించండి?
ప్రతిఏటా మూడు దఫాలుగా క్లినికల్స్ ట్రయల్స్ నిర్వహించాలి. గర్భిణులు, చిన్నపిల్లలు, పాఠశాలల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి