May 06,2023 16:41

హమాలీలకు దుస్తులను పంపిణీ చేస్తున్న మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి

సేవా కార్యక్రమాల్లో నా అన్నదమ్ముల సహకారం మరువలేనిది - బిసి రాజారెడ్డి
 కీ.శే బిసి గురెడ్డి జ్ఞాపకార్థం హమాలీలకు ఉచితంగా దుస్తులు పంపిణీ చేసిన బిసి రాజారెడ్డి
ప్రజాశక్తి బనగానపల్లె
 సేవా కార్యక్రమాల్లో నా అన్నదమ్ముల సహకారం మరువలేనిదని మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి పేర్కొన్నారు .శనివారం పట్టణంలోని  కీర్తిశేషులు బీసీ గుర్రెడ్డి జ్ఞాపకార్థం  బిసి రాజారెడ్డి  హమాలీలకు ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీసీ గుర్రెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో బిసి రాజారెడ్డి మాట్లాడుతూ తన తండ్రి బిసి గుర్రె డ్డి 1993లో మరణించడం జరిగిందని అప్పటి నుండి ఆయన పేరు మీద ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేయాలని సంకల్పం తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగానే 1994 నుంచి ప్రతి సంవత్సరం పేదలకు, విద్యార్థులకు తదితరులకు దుస్తులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం 70 మంది హమాలీలకు 67 వేల రూపాయలు విలువచేసే దుస్తులను పంపిణీ చేసినట్లు తెలిపారు. 1994 నుంచి నేటివరకు 29 ఏళ్లుగా దుస్తుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందన్నారు . 1986 నుంచి హమాలీలతో నాకు మంచి అనుబంధం ఉందని, వారి కష్టం విలువ తనకు తెలుసన్నారు. అప్పట్లో తనకు సంబంధించిన రాజా అండ్ కో అనే సంస్థలో ఎంతోమంది హమాలీలు పనిచేసేవారని గుర్తు చేసుకున్నారు.   రాత్రి పగలు అనే తేడా లేకుండా హమాలీలు శ్రమిస్తూ ఉంటారని,  వారి శ్రమను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. తాను చేసే సేవా కార్యక్రమాల వెనుక అన్నదమ్ముల సహకారం మరువలేనిది అన్నారు. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను ప్రేమించాల్సిన అవసరం ఉందన్నారు. తల్లి తండ్రి తర్వాతే గురువు,  దైవం అన్నారు. తల్లిదండ్రుల పేరు మీద సేవా కార్యక్రమాలు చేయడం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. జీవితమనే సాగరంలో ఎన్నో తప్పులు, ఒప్పులు చేస్తుంటామని , పిల్లలు ఎన్ని తప్పులు చేసినా వెనుకేసుక రావడం తల్లిదండ్రుల ప్రేమకు నిదర్శనమన్నారు. ప్రజలందరి సహకారంతో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. డాక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ కీర్తిశేషులు బీసీ గురెడ్డి క్రమశిక్షణకు,  నిక్కచ్చితనానికి మారుపేరు అన్నారు. గుర్రెడ్డి తో  తనకు ఎంతో స్నేహ సంబంధాలు ఉండేవని,  ఆయన ఎప్పుడూ పేద ప్రజలకు ఏదో సహాయం చేయాలని తపిస్తుండేవారన్నారు . బిసి గుర్రెడ్డి కలలను, ఆశయాలను ఆయన కుమారుడు బిసి రాజారెడ్డి నెరవేరుస్తుండడం అభినందనీయం అన్నారు.  తనకు బీసీ కుటుంబంతో 40 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. 30 ఏళ్ల క్రితం బిసి గుర్రెడ్డి మృతి చెందారని అప్పటినుండి నేటి వరకు కూడా బిసి రాజారెడ్డి తండ్రి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు.. బనగానపల్లె పట్టణంలో నీటి కొరతను తీర్చిన ఘనత బిసి రాజారెడ్డికే దక్కుతుందన్నారు. బిసి గుర్రె డ్డి పెద్ద కుమారుడు బిసి బాల తిమ్మారెడ్డి సైతం వారి కుటుంబానికి దిక్సూచిలా ఉంటూ సలహాలు,  సూచనలు ఇస్తూ ఉండేవారని,  ఆయన మృతి చెందడం బాధాకరం అన్నారు, ఈ సందర్భంగా బిసి బాల తిమ్మారెడ్డి మృతికి నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. భవిష్యత్తులో నిరుపేదల కోసం బిసి రాజారెడ్డి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని డాక్టర్ విజయకుమార్ సూచించారు.  రిటైర్డ్ హెచ్ఎం ఐఎన్ పక్కీరారెడ్డి మాట్లాడుతూ బిసి గురెడ్డి అన్నతో తనకు మొదటి నుంచి ప్రత్యేక అనుబంధం ఉండేదన్నారు. ఆయన కుమారులు కూడా నన్ను కుటుంబ పెద్దగా భావిస్తూ సలహాలు , సూచనలు తీసుకుంటుంటారన్నారు. తల్లిదండ్రుల పేరుమీద బిసి రాజారెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని , పేదల కోసం మంచి కార్యక్రమాలు చేయాలని నిత్యం ఆలోచిస్తూ ఉంటారన్నారు.