Jun 11,2023 17:56

రక్త దానం చేసిన శ్రీరామ్‌

సేవా గుణానికి సలాం
- 33 సార్లు రక్తదానం చేసిన శ్రీరామ్‌

ప్రజాశక్తి - ఆదోని

కొందరు రక్తదానం అనగానే ఏదో కారణం చెప్పి తప్పించుకుంటారు. కానీ ఆదోని వాసి శ్రీరామ్‌ మాత్రం రక్తం అవసరం అని తెలియగానే వాలిపోతాడు. అందుకే అతను ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 33 సార్లు రక్తదానం చేశాడు.
ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని వెలురు పట్టణం సీఎంసీ రాణి పేట్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలో కర్ణాటక రాష్ట్రం రాయచూరు పట్టణానికి చెందిన బసవన్నగౌడ్‌కు కిడ్నీ క్యాన్సర్‌ వల్ల అత్యవసరంగా ఏ-పాజిటివ్‌ రక్తం అవసరమైతే ఆదోని జనసేవా సామజిక సేవా సంస్థ కార్యదర్శి విరుపాక్షి స్వామికి సమాచారం అందించగా.. రక్తదాత శ్రీరామ్‌కు ఫోన్‌ చేయగానే వెంటనే స్పదించి వెలురుకు వెళ్లి రక్తదానం చేశారు. స్వచ్చదంగా 33వ సారి రక్తదానం చేసి శ్రీరామ్‌ సేవా గుణాన్ని చాటుకున్నాడు. రక్తదానం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని, యువత అపోహలు వీడి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని రక్తదాత శ్రీరామ్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో నందవరం మల్లికార్జున గౌడ్‌, విరుపాక్షి స్వామి పాల్గొన్నారు.