ప్రజాశక్తి- దేవనకొండ
మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తామని వైసిపి జిల్లా కోశాధికారి కొత్త కాపు మధుసూదన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం దేవనకొండ ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో బాలింతలకు, గర్భిణులకు, రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విశాఖ పీఠాధిపతి స్వరూప నందేంద్ర స్వామి పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో అనాథ, నిరుపేదల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. తెర్నేకల్ ఎంపిటిసి నామాల శ్రీనివాసులు, ఉప సర్పంచి భర్త బెల్ ఈరన్న, వార్డు సభ్యులు బడే సాబ్, గ్రామస్తులు మోహన్, హనుమంతు, పురుషోత్తమ రెడ్డి, రాజశేఖర్, గోపి పాల్గొన్నారు. ఆస్పరిలోని కస్తూరిబా పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థి పల్లవి యోగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతుండగా విద్యార్థికి మధుసూదన్‌రెడ్డి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. పత్తికొండ పట్టణంలోని వృద్ధాశ్రమంలో అనాథలకు అన్నదానం చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి, మాజీ ఎంపిపి నాగరత్నమ్మ పాల్గొన్నారు.