కడప : జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారిత (ఐసిడిఎస్)శాఖలో సిడిపి ఒలు, సూపర్‌వైజర్ల సమన్వయంతో, సేవా దృక్పథంతో పని చేసినప్పుడే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని కలెక్టర్ వి.విజరు రామరాజు పేర్కొ న్నారు. బుధవారం కలెక్టరేట్ లోని స్పందన హాలులో జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంసంక్షేమ పథకాలను పొం దుతున్న ప్రతి లబ్దిదారు కుటుంబం కూడా అంగన్వాడీ సేవలను పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతివారమూ రెండు ప్రాజెక్టులను పర్యవేక్షించాలని పీడీని ఆదేశించారు. రోజూ మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాలోని సిడిపిఒలు అందరితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీకి సంబంధించి రిపోర్టు తీసుకో వాలన్నారు. తమ పరిధిలోని సంక్షేమ వసతి గహల్లో బాలికల సమస్యలను తెలుసుకోవాలన్నారు. సుస్థిర అభివద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా అనీమిక్, బరువు తక్కువ పిల్లలకు పోషకాహారం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఐసిడిఎస్ శాఖకు సంబంధించి వచ్చే ప్రతి అభ్యర్థనను పెండింగ్‌లో లేకుండా పూర్తిస్థాయిలో పరిష్కారం చూపాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో కేవలం బాలింతలకు, గర్భిణులకు, బాలబాలికలకు మాత్రమే కాకుండా మహిళలకు, వద్ధులకు కూడా సేవలు సేవలు అందివ్వాలని సూచించారు. వారికి సరైన పౌష్టికాహారం, ప్రణాళిక ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహిస్తూ మహిళలు, బాలికలకు రక్త హీనత (అనీమిక్) సమస్యలు రాకుండా వైద్య శాఖ సిబ్బంది ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పర్యవేక్షించాలన్నారు. ఆధార్ సీడింగ్ పై స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. మహిళలు, చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందినపుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అందుకోసం సంబందిత శాఖల సిబ్బంది సమన్వయం, సేవభావం, అంకిత భావంతో పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలి చేయకపోతే శాఖ పరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది అని చెప్పారు.వైఎస్‌ఆర్ జిల్లాను మాత మరణాలు లేని జిల్లాగా తీర్చిదిద్దడానికి వైద్య ఆరోగ్య, ఐసిడిఎస్ సిబ్బంది సమన్వయంతో కషి చేయాలని కలెక్టర్ వి.విజరు రామరాజు ఆదేశించారు. ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఎలాంటి సమస్యలున్నా తమ దష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి శ్రీలక్ష్మీ, సీడీపీవోలు, అంగన్వాడీ సూపవైజర్లు పాల్గొన్నారు.










