రాయచోటి : విద్యార్థులు చదువుతోపాటు సేవా భావారింర కూడా అలవర్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం పేర్కొన్నారు. గురువారం డైట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర అకాడమిక్ ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఇఒ మాట్లాడుతూ సంస్థ అధినేత చెంచు వేణుగోపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తతీయ స్థానాలు పొందిన విద్యార్థులను అభినందించారు. ఎంతోమంది పేద కుటుంబాల నుంచి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని జీవితంలో తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలన్నారు. పిఆర్‌టియు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ రాయచోటి తాలూకాలోని ప్రతి మండలం నుంచి ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రూ. 5,116 , ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ. 4,116, తతీయ స్థానంలో నిలిచినవారికి రూ. 3116 చొప్పున ఆరు మండలాల నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ ఆర్య కుమార్,ఐ ఈ డి కోఆర్డినేటర్ జనార్ధన్, విద్యార్థులు పాల్గొన్నారు.










