Apr 30,2023 17:17

ప్రభుత్వ ఆసుపత్రిలో పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్న ప్రార్థన సమయం నిర్వాహకులు జాన ప్రభాకర్

సేవ చేయడంలోనే నిజమైన ఆత్మసంతృప్తి
ప్రజాశక్తి-డోన్

       సమాజంలో సేవ చేయడంలోనే నిజమైన ఆత్మసంతృప్తి ఉంటుందని  ప్రార్థన సమయం నిర్వాహకులు జాన.ప్రభాకర్ అన్నారు.ఆదివారం బాయిపల్లి గ్రామానికి చెందిన రెడ్డి జనార్ధన్ ఆర్థిక సహాయంతో డోన్ ప్రభుత్వ ఆసుపత్రి నందు  గర్భవతులకు,బాలింతలకు,రోగులకు,రొట్టె,పప్పు, గుడ్డు అందజేశారు.ఈ సందర్భంగా జాన.ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి ఈ పౌష్టికాహారం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.దాతల సహకారంతో ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.దాతలు మరింత సహకారం అందిస్తే  సేవ కొనసాగించేందుకు ముందుకు వెళతా అన్నారు.ఈ కార్యక్రమంలో ఫక్రుద్దీన్ హోసన్న వృద్ధాశ్రమం సూపర్వైజర్ భారతి తదితరులు పాల్గొన్నారు.