Sep 21,2021 06:10

     సోనూ సూద్‌ అనగానే వెంటనే గుర్తు వచ్చేది ఆయన నటన. తర్వాత ఆయన సేవాభావం. సినిమాల్లో విలన్‌ పాత్రలు పోషించినా, నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో అకస్మాత్తుగా ఆయన మీద ఆదాయ పన్ను శాఖ వారు దాడులు నిర్వహించారు. సోనూ సూద్‌ రూ. 20 కోట్ల వరకు పన్ను ఎగవేశాడని ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలకు సాయం చేస్తున్న ఒక నటుడిపై కేంద్ర ప్రభుత్వం ఇంతగా కక్ష సాధింపు చర్యలు ఎందుకు చేపడుతుందో అర్ధంకావటం లేదు. ఎవరైనా దానం చేసినా, సహాయం చేసినా, హుండీలో డబ్బులు వేసినా, అలాంటి వాటికి అదాయ పన్ను ఎలా వర్తిస్తుంది? దేశంలో కరోనా మొదటి విడతలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా అప్పటికప్పుడే లాక్‌డౌన్‌ పెట్టింది. ఒక్కసారిగా దేశంలో వలస కార్మికులపై, ఎనలేని ప్రభావం పడింది. వాళ్లకు రవాణా సౌకర్యం స్తంభించి పోయింది. ఇలాగే ఇక్కడ ఉండలేరు. తీరా తప్పకుండా వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళారు. రైళ్లు లేక బస్సులు లేక, చాలా వరకు కాలినడక ప్రయాణం చేశారు. మార్గమధ్యంలో తిండి లేక కొంత మంది మరణించారు. ఇలాంటి, క్లిష్ట పరిస్థితుల్లో నేనున్నా అంటూ సోనూ సూద్‌ ముందుకు వచ్చి బస్సులు, రైళ్లు, విమాన ప్రయాణానికి సైతం టికెట్లు ఇప్పించాడు. ఎందరినో కాపాడాడు. ప్రభుత్వం చేయలేని స్థితిలో సోనూ సూద్‌ చేశాడు. రెండవ లాక్‌డౌన్‌ లో ఆక్సిజన్‌ కొరతగా ఉంటే ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశాడు. ఎన్నో ప్రాణాలు కాపాడిన వ్యక్తిగా పేరు పొందాడు.
    రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు, దేశంలోకెల్లా అత్యంత కుబేరులమని చెప్పుకునే అదానీ, అంబానీలు ఏం సహాయం చేశారు? వాళ్లు చేయలేని సహాయం సోనూ సూద్‌ చేశాడు. ప్రజల్లో దేవుడు అయ్యాడు. ప్రభుత్వం ఆయనను మెచ్చుకోక పోగా రైడ్లకు దిగటం చాలా సిగ్గుచేటు. వ్యక్తుల మీద కాకుండా బిజెపి ప్రభుత్వం ముందుగా దేశ అభివృద్ధిపై దృష్టి సారించాలి. ఒక పక్క దేశంలో కరోనా కట్టడికి విఫలం అయ్యింది. కోటి ఉద్యోగాలు అని చెప్తూ నిరుద్యోగాన్ని పడకేసింది. దేశ ప్రజల ఆస్తులను అమ్ముతూ ప్రభుత్వాన్ని సరిగ్గా నడపకుండా దేశాన్నీ కార్పొరేట్‌ కంపెనీ చేతుల్లో పెట్టేస్తోంది. బిజెపి ప్రభుత్వం ఎడెళ్ళ పాలనలో ఒరిగింది ఏమీ లేదని చెప్పుకోవచ్చు. రైతు వ్యతిరేక బిల్లులు తెచ్చింది. నొట్ల రద్దు, తీసుకొచ్చి నల్లధనం బయటకి తెస్తానని చెప్పి నేటికీ లెక్కలు లేకుండా చేసింది. దేశాన్ని అతలాకుతలం చేసింది. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో సరైన బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారనడంలో సందేహం లేదు.
 

- బొమ్మరగొనీ కిరణ్‌,
సెల్‌: 7989381219