Feb 18,2023 21:03

శేష వాహనంపై మహా నందీశ్వరుడు

శేష వాహనంపై మహా నందీశ్వరుడు
వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
ప్రజాశక్తి - మహానంది

      ప్రముఖ శైవక్షేత్రం మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం కామేశ్వరి దేవి సమేత మహానందీశ్వర స్వామి వారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో చంద్రశేఖర్‌ రెడ్డి, పాలకమండలి చైర్మన్‌ మహేశ్వర్‌ రెడ్డిల ఆధ్వర్యంలో వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవతో ఆలయ పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. శివరాత్రి బ్రహ్మౌత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారి దర్శనార్థమై లక్షల సంఖ్యలో భక్తులు క్షేత్రానికి వచ్చారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాత్రి 10 గంటల నుండి క్షేత్రంలో లింగోద్భవ కాలంలో సామాన్య భక్తులు కూడా దర్శనం చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక సేవా టికెట్లు ఏర్పాటు చేశారు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల నుండి స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో మెడికల్‌ క్యాంపులు, నిత్యాన్నదాన ప్రసాద కౌంటర్లు, మజ్జిగ, తాగునీరు దాతల సహాయంతో ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.