Sep 01,2023 22:54

పుష్పగుచ్ఛం అందజేస్తున్న విద్యార్థిని

శ్రీకాకుళం అర్బన్‌ : వ్యవసాయం పూర్వకాలంలో మొత్తం సేంద్రీయ ఎరువులపైనే ఆధారపడి పంటలు పండిచేశారని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార దిగుబడులు పెంచడానికి ఆధునిక వంగడాలతో పాటుగా రసాయనాల వాడకం పెంచాల్సిన అవసరం నెలకొందని సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షులు గొండు శంకర్‌ అన్నారు. స్కై కాలేజీ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ ఆధ్వర్యాన మూడు రోజుల శిక్షణా తరగతుల్లో భాగంగా ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎస్‌ఆర్‌ పురంలో మూడు రోజుల పాటు సేంద్రీయ ఎరువుల వినియోగంపై నిర్వహించనా శిక్షణా తరగతులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేంద్రీయ ఎరువుల ద్వారా పంటలు సాగు చేస్తే ఎంతో మేలు కలుగుతుందని, భూసారానికీ ఎలాంటి ముప్పు కూడా ఉండదని అన్నారు. ఇటీవల కాలంలో సేంద్రీయ ఎరువులతో పండించిన ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుందన్నారు. ప్రజలు కరోనా వచ్చాక ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటున్నారని అన్నారు. సేంద్రీయ, ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తుల వినియోగంపై ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ప్రకృతి సేద్యం వల్ల దిగుబడి కొంత తగ్గినా, రుచి బాగుంటుందని, ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు. సాధారణ పద్ధతిలో సాగుచేసిన వాటితో పోలిస్తే ప్రకృతి సేద్యంతో పండిస్తే మార్కెట్లో ఎక్కువ ధర లభిస్తుందని చెప్పారు.