Apr 20,2023 00:49
రైతులకు అవగాహన కల్పిస్తున్న విద్యార్థిని చైతన్య

ప్రజాశక్తి-అద్దంకి: రైతులు సేంద్రీయ పద్ధతిలో పంటలను సాగుచేస్తే మంచి దిగుబడులతోపాటు ఆర్థిక లాభం చేకూరు తుందని ఒడిశాలోని పర్లాకిమిడికి చెందిన సెంచూరియన్‌ యూనివర్సిటీ విద్యార్థిని తాటి చైతన్య తెలిపారు. రైతులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు చేకూరే విధంగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసినట్లయితే మంచి దిగుబడితోపాటు మేలురకమైన పంట నాణ్యత ఉంటుందని అన్నారు. రసాయనిక ఎరువులు వాడడం కన్నా సహజసిద్ధమైన సేంద్రియ పద్ధతిలో పంట సాగు చేసినట్లయితే నాణ్యమైన పంట చేతికి అందుతుందని తెలిపారు. జీవామృతం తయారుచేసి పంటలకు పిచికారీ చేయాలన్నారు. రసాయనిక ఎరువులు పూర్తిగా తగ్గించాలన్నారు. నియోజక వర్గంలో పలు గ్రామాలలో రైతులకు అవగాహన కల్పించారు.