సదుం లో వరుస చోరీలు
స్థానికుల ఆందోళన
ప్రజాశక్తి -సోమల: మండల కేంద్రమైన సదుం నందు మంగళవారం అర్థరాత్రి వరుస చోరీలు జరిగాయి. కాలేజ్ రోడ్ లో నాలుగు ఇళ్లలో దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ చేశారు. ఆంజనేయులు అనే వ్యక్తి తన మామ కు ఆరోగ్యం బాగాలేక మదనపల్లెకు వెళ్ళాడు. బుధవారం ఉదయం ఇంటి తలుపులు తీసి వుండటం గమనించిన ఇరుగుపొరుగువారు ఆయనకు సమాచారం ఇచ్చారు. ఆకుల ధరణీ ఇంటికి తాళం వేసుకుని బందువుల ఇంటికి వెళ్ళి ఉదయం వచ్చి చూడగా తాళం పగుల గొట్టి వుంది. ఇరువురూ సదుం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ ఐ మారుతి తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిత్తూరు క్లూస్ టీమ్ కు సమాచారం అందించడంతో వారు వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఆంజనేయులు ఇంటిలో 29గ్రాముల బంగారు నగలు, 80వేలు నగదు పొయినట్లు పిర్యాదు చేయగా, ధరణీ ఇంటిలో 10 గ్రాముల బంగారం, వెండి గొలుసు చోరీ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పై రెండు సంఘటనలతో పాటు వీ ఆర్ వో ల గది తాళాలు పగుల గొట్టి గది లోపల వస్తువులన్నీ చిందర వందర చేసినట్లు సమాచారం. అదేవిధంగా మరో రెండు ఇళ్ళలో దొంగలు తిరిగినట్లు ప్రచారం జరుగుతున్నా దీనిపై పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిసింది.










