పలాస : కిసాన్ సంయుక్త మోర్చా, ట్రేడ్ యూనియన్‌ల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యాన విజయవాడలో ఈ నెల 30న జరగనున్న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మోహనరావు పిలుపు నిచ్చారు. స్థానిక ఎన్‌జిఒ హోమ్ ఆవరణలో మంగళవారం సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాల వల్ల రైతులు, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే చట్టాలు చేశారని గుర్తు చేశారు. కానీ రద్దు చేసిన సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. హామీలు అమలు కోసం కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఐక్యపోరాటాన్ని సాగించేందుకు సన్నాహక సదస్సు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సదస్సులో రైతులు, రైతు కూలీలు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆలిండియా రూరల్ లేబర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి టి.సన్యాసిరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి, ఎఐకెఎంఎస్ నాయకులు ఎం.వినోద్‌కుమార్, ఎపి రైతు సంఘం నాయకులు సిహెచ్.వేణుగోపాల్ పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు : మండలంలోని బెండిలో విజయవాడలో నిర్వహించనున్న సదస్సు పోస్టర్‌ను రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు టి.భాస్కరరావు, కె.బాలాజీరావు, ఎం.గణేష్, రైతు సంఘం నాయకులు కె.హేమసూదన్, శంకరరావు, కె.శశి, ఆర్.నీలాచలం, కార్మిక సంఘం నాయకులు కె.వెంకటరాఉవ, కె.అప్పారావు, ఎన్.సింహాచలం, మల్లయ్యలు ఆవిష్కరించారు.










