ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ వెంకట సుబ్బారావు
సచివాలయంలో ఎంపిడిఒ తనిఖీ
ప్రజాశక్తి-బిట్రగుంట : బోగోలు మండలం ఏనుగుల బాయి సచివాలయంలో ఎంపిడిఒ వెంకట సుబ్బారావు సోమవారం ఆకస్మిక తనిఖీ చేసి సచివాలయంలోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజలకు కావల్సిన అన్ని రకాల సర్టిఫికెట్లను పొందేందుకు వలంటీర్ వ్యవస్థ పనిచేస్తుందని, ఇంటికి కావల్సిన 11 రకాల సర్టిఫికెట్లను ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు వాలంటరీల ద్వారా ఇంటికి అందిస్తుందని, ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఆధార్ పొందాలని ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాలని సూచించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.










