చోరీ జరిగిన సచివాలయం
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : మండలంలోని కోడూరు మేజర్ పంచాయితీ బిట్-1 సచివాలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు పంచాయితీ కార్యదర్శి కె. శ్రీనివాసులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంలు సచి వాలయం మేడ పై భాగం నుంచి కిందికి దిగి ఈ చోరీకి పాల్పడ్డారని తెలిపారు. మూడు మానిటర్లు, మూడు సిపిఎస్, ఒక కీబోర్డ్, మూడు మౌసులు చోరీకి గురైటన్లు సెక్రెటరీ తెలిపారు. చోరీకి గురైన వాటి విలువ సుమారు రెండు లక్షలు వుంటుందని అయన తెలిపారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కార్యదర్శి తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జంపాని కుమార్ తెలిపారు.










