రికార్డులు పరిశీలిస్తున్న ఆర్‌డిఒ పార్థసారథి
ప్రజాశక్తి-భట్టిప్రోలు: భట్టిప్రోలు రెండో సచివాలయాన్ని గురువారం రేపల్లె ఆర్‌డిఒ పార్థసారథి తనిఖీ చేపట్టారు. ముందుగా వెల్లటూరు సచివాలయాన్ని సందర్శిస్తున్నట్లు సమాచారం అందించినప్పటికీ దానిని కాదని భట్టిప్రోలు-2 తనిఖీ చేశారు. ముందస్తు సమాచారం ఇస్తుండటంతో రికార్డులలో ఉన్న అవకతవకలు సరిచేసుకుంటున్నారని, అందుకని సమాచారం లేకుండానే భట్టిప్రోలు-2ను పరిశీలించినట్లు ఆర్‌డిఒ తెలిపారు. సిబ్బంది పనితీరు, సమయపాలన, హాజరు వంటి పలు అంశాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేపల్లె సిడిపిఒ మాణిక్యం, కార్యదర్శి శ్రీనివాసరావు, ఇన్‌ఛార్జి ఆర్‌ఐ శివరామకృష్ణ, విఆర్‌ఒ ప్రసాద్ తదితరులు ఉన్నారు.










