రికార్డులను పరిశీలిస్తున్న తహశీల్దార్
రికార్డులను పరిశీలిస్తున్న తహశీల్దార్
సచివాలయంలో ఆకస్మిక తనిఖీ
ప్రజాశక్తి-సంగం:స్థానిక సచివాలయం -3 ను తహశీల్దార్ నాగరాజు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సచివాలయంలోని రికార్డులు పరిశీలించి సంక్షేమ పథకాల అమలు తీరు గురించి సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరును పరిశీలించారు. సిబ్బంది తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని సూచించారు. అదేవిధంగా సచివాలయంలో ఆధార్ పనితీరు గురించి ఆరా తీసి తప్పనిసరిగా ఆధార్ సెంటర్ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










