రికార్డులను పరిశీలిస్తున్న అధికారి
సచివాలయంలో ఆకస్మిక తనిఖీ
ప్రజాశక్తి-బిట్రగుంట:బోగోలు మండలం పరిధిలో గల తాళ్లూరు గ్రామ సచివాలయం గురువారం ఎంపీడీఓ వెంకట సుబ్బారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిని పరిశీలించి పలు రికార్డులను తనిఖీ చేశారు. ఎటువంటి సమాచారం లేకుండా పంచాయతీ కార్యదర్శి గైర్హాజరు పట్ల తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేసి మెమో జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైతే అటువంటి పంచాయతీ కార్యదర్శులపై సచివాలయ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా సచివాలయ సిబ్బంది పనిపై బయటకు వెళ్లినప్పుడు మూమెంట్ రిజిస్టర్‌లో నమోదు పరిచి బయటకు వెళ్లాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ గురించి ఎఎన్‌ఎం కి పలు సూచనలు జారీ చేశామన్నారు. త్వరితిగతన ఈ కేవైసీ పూర్తి చేయాలని సిబ్బందికి తెలిపామన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.










