Oct 05,2023 21:14

నూతన భవనాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

ప్రజాశక్తి - వేపాడ : మండలంలోని పాటూరులో నూతనంగా నిర్మించిన సచివాలయం, వెల్నెస్‌ కేంద్రాలను ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో సుసాధ్యం చేశామన్నారు. ప్రతి కుటుంబానికి గ్రామంలో వైద్య సేవలందించే విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నామన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని వారిద్దరూ సందర్శించారు. ఈ సందర్భంగా ఓపి, క్షేత్రస్థాయిలో నిర్వహించిన టెస్టు, వైద్య నిపుణులు, మందుల సరఫరా తదితర అంశాలపై ఆరోగ్య సిబ్బందిని ఆరా తీశారు. ప్రజలకు గ్రామాల్లోనే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్వహిస్తున్న ఈ ఆరోగ్య శిబిరాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజరు కుమార్‌, కొత్తవలస మార్కెటింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మూకల కస్తూరి, ఎంపిపి డి.సత్యవంతుడు, జెడ్‌పిటిసి సేనాపతి అప్పలనాయుడు, పంచాయతీరాజ్‌ జోనల్‌ ఇంఛార్జి మెరుపుల సత్యనారాయణ, వైసిపి మండల అధ్యక్షుడు మమ్ములూరు జగన్నాథం, వైస్‌ ఎంపిపి అడపా ఈశ్వరరావు, సర్పంచ్‌ కె. వెంకటలక్ష్మి, ఎంపిటిసి ద్వారపూడి మంగమ్మ, పాటూరు సచివాలయ కన్వీనర్‌ ద్వారపూడి గంగు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
వేపాడలో ఆరోగ్య సురక్ష పరిశీలన
మండల కేంద్రంలో నిర్వహిస్తున్న జగనన్న సురక్ష ఆరోగ్య సేవలను స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎంపిపి డి సత్యవంతుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రోగులతో మాట్లాడుతూ వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు.