
నకరికల్లు: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మండల పరిధి లోని నకరికల్లులో రెండు సచివాలయాలు రెండు రైతు భరోసా కేంద్రాలు, చల్లగుండ్లలో సచి వాలయం, వెల్నెస్ సెంటర్, చాగల్లులో సచివాల యాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్ నేస్ సెంట ర్లను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ గ్రామాల్లో సచివాలయాల ద్వారా ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానిదే అన్నారు.ఆయా కార్యక్రమాల్లో వైసిపి మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, ఎంపిపి ఎం. అనురాధ, మండల ఉపాధ్యక్షులు ఎం.ప్రవీణ్ కుమార్‌రెడ్డి, సర్పంచ్ పరస అంజమ్మ, తహశీల్దార్ కె.నగేష్, ఎంపిడిఒ బండి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ శాఖాధికారి దేవదాస్ పాల్గొన్నారు.