ప్రజాశక్తి-కోటనందూరు గ్రామ సుపరిపాలన సచివాలయాలతోనే సాధ్యమని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. ఆదివారం టిజె.నగరం, ఇండుగపల్లి గ్రామాలకు కలిపి రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు దూర ప్రాంతాల్లో ఉన్న మండల కేంద్రాలకు వెళ్ళకుండా గ్రామాల్లోనే పరిపాలన అందించాలనే ఉన్నతమైన లక్ష్యంతో సచివాలయ వ్యవస్థను రూపొందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్.జగన్ దేనని కొనియాడారు. దీంతో ప్రజలకు సమయం ప్రయాణ ఖర్చులు ఆదా అవుతున్నాయన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సర్టిఫికెట్టనూ ఇక్కడ పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంచే అచ్చిరాజు, ఎస్.రాంబాబు, ఎంపిపి లగుడు శ్రీనివాస్, మండల కన్వీనర్ చింతకాయల చినబాబు, రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి డైరెక్టర్ లంక ప్రసాద్, కో ఆప్షన్ సభ్యుడు జగటాల కోట సత్తిబాబు, మండల వ్యవసాయ శాఖ అడ్వైజర్ కమిటీ చైర్మన్ ఎస్.రాజు పాల్గొన్నారు.










