Aug 24,2023 19:26

రికార్డులు పరిశీలిస్తున్న ఎంపిడిఒ

రికార్డులు పరిశీలిస్తున్న ఎంపిడిఒ
సచివాలయాల్లో తనిఖీ
ప్రజాశక్తి-వరికుంటపాడు:మండలంలోని తిమ్మారెడ్డిపల్లి, వేంపాడు సచివాలయాలను గురువారం ఎంపీడీఓ శ్రీదేవి తనిఖీ చేశారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఆనంతరం నిర్మాణంలోని తిమ్మారెడ్డిపల్లి వేంపాడు సచివాలయం రైతు భరోసా కేంద్రం జగనన్న కాలనీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధులు పట్ల సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదన్నారు.
సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సకాలంలో సమస్యల పరిష్కారంకు ప్రతి ఒక్క ఉద్యోగి కషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.