ప్రజాశక్తి - ముదినేపల్లి
జిల్లా పంచాయతీరాజ్ అధికారి అదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో గురువారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల సమయం వరకు స్పందన కార్యక్రమం నిర్వహించాలని అదేశాలు ఉన్నాయి. దీంతో అధికారులు గ్రామ సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సచివాలయ అధికారులు తమ విధులకు హాజరై స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 21 గ్రామ సచివాలయాల్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మండలంలోని ఏ గ్రామ సచివాలయం నుంచి ఏ సమస్యపై ఎలాంటి ఫిర్యాదుల సచివాలయ అధికారులకు అర్జీలు రాలేదని ఇఒపిఆర్‌డి టివి.సారధి తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీహరిపురం గ్రామ సచివాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కార్యదర్శి జె.గిరజ, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










