సచివాలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఉదయశ్రీ
ప్రజాశక్తి-నక్కపల్లి:సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలని డిఎల్‌పిఓ ఉదయశ్రీ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వాలంటీర్ల సర్వే, ఆధార్ సెంటర్‌లు, సచివాలయ ఉద్యోగుల పనితీరు, సచివాలయం సేవలు, హౌసింగ్ నిర్మాణాలు, ప్రభుత్వ భవనాలపై ఆరా తీశారు. ఎంపీడీవో సీతారామరాజు ఇందుకు సంబంధించిన వివరాలను ఆమెకు తెలియజేశారు. అనంతరు ఆమె దోసలపాడు, రేబాక సచివాలయాలను సందర్శించారు. వాలంటీర్ల సర్వే, ఆధార్ నమోదును పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రాజశేఖర్, అప్పలరాజు, కిరణ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










