మాట్లాడుతున్న కమిషనర్
సచివాలయాల్లో కమిషనర్ తనిఖీ
ప్రజాశక్తి-నెల్లూరు:నగర పాలక సంస్థ పరిధిలోని స్థానిక 46/1 దండువారి వీధి, 46/3 బందావనం వార్డు సచివాలయాలను కమిషనర్ వికాస్ మర్మత్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయాలలోని తనిఖీ రిజిష్టరు, నోటీసు బోర్డు, హాజరు రిజిస్టరు, స్పందన రిజిష్టరులతో పాటు వివిధ సంక్షేమ పథకాల రికార్డులను పరిశీలించారు. సచివాలయాల పరిధిలోని ప్రజలకు స్థానిక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అందిస్తున్న ఉచిత వైద్యం, మందుల పంపిణీ, రక్త పరీక్షలు తదితర సేవలపై అవగాహన కల్పించాలని కమిషనర్ సూచించారు.సచివాలయాలలో పెండింగులో ఉన్న సేవలను గడువులోపు పూర్తి చేయాలని, సాంకేతిక అంశాలపై కార్యాలయం నుంచి నేరుగా సూచనలు పొందాలని కార్యదర్శులకు సూచించారు.కార్యక్రమంలో నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం డిసిపి దేవీ కుమారి, సిబ్బంది పాల్గొన్నారు.
6










