Aug 16,2023 21:53

ఫొటో : రికార్డులను పరిశీలిస్తున్న ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌

సచివాలయాల్లో ఎంపిడిఒ పరిశీలన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : మండలంలోని మహిమాలూరు, రామస్వామిపల్లి సచివాలయాల్లో బుధవారం ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది బయోమెట్రిక్‌ హాజరు పరిశీలించారు. సచివాలయ పరిధిలో ఉన్న డ్రాప్‌ అవుట్‌ విద్యార్థులను గుర్తించి తప్పనిసరిగా బడిలో చేర్పించాలని సిబ్బందికి సూచించారు. సచివాలయం ద్వారా అందజేస్తున్న అన్ని సర్వీసులను అలసత్వం లేకుండా ప్రజలకు అందజేయాలని సూచించారు.
జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అర్హులైన లబ్ధిదారులు వివిధ పథకాల కోసం అప్లై చేసుకొని ఉంటే 18వ తేదీ లోపల పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.