బిల్లులు చెల్లించకపోవడమే కారణం
సేవలందక జనం అవస్థలు: కలెక్టర్ జోక్యంతో సమస్య పరిష్కారం
ప్రజాశక్తి - చింతలపూడి
సచివాలయం కరెంట్ బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతో ఆ శాఖ విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దీంతో సచివాలయంలో అన్నిరకాల సేవలు నిలిచిపోవడంతో ఆ సచివాలయ పరిధిలోని జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పది రోజులుగా ఇదే పరిస్థితి నెలకొన్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడం దారుణమని అంతా విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మండలంలో రాఘవాపురం, మల్లయ్యగూడెం, పోతునూరు సచివాల యాలకు సుమరు పది రోజుల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మల్లయ్యగూడెం సచివాలయంలో కంప్యూటర్, ప్రింటర్‌ను పోతునూరు పంచాయతీ వద్దకు తీసుకెళ్లి సిబ్బంది అక్కడ నుంచి పని చేస్తున్నారు. ఈ పరిస్థితి పది రోజుల నుంచి ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రతిరోజూ ఏదోక పనిపై సచివాలయానికి వస్తుంటారని, విద్యుత్ సరఫరా లేదని చెప్పడంతో చింతలపూడి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విద్యుత్ శాఖ సిబ్బందిని ప్రశ్నించగా విద్యుత్ బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతో అధికారుల ఆదేశాల మేరకు కనెక్షన్ కట్ చేశామన్నారు. ఎంపిడిఒ మణికుమారిని ఈ సమస్యపై ప్రశ్నించగా కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ దృష్టికి సమస్యను తీసుకెళ్లానన్నారు. ఆయన విద్యుత్ శాఖాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించారని










