Sep 01,2023 22:31

కోటబొమ్మాళి : వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - శ్రీకాకుళం యంత్రాంగం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యాన చేపడుతున్న సమరభేరి కార్యక్రమంలో భాగంగా నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాలని, పెంచిన విద్యుత్‌ ఛార్జీలు ఉపసంహరించాలని, విద్యుత్‌ కోతలు ఆపాలని జిల్లాలోని పలు మండలాల్లో సచివాలయాల వద్ద శుక్రవారం ధర్నాలు చేపట్టారు. అనంతరం సచివాలయాల కార్యదర్శులకు వినతిపత్రాలు అందజేశారు. ఇందులో భాగంగా కోటబొమ్మాళి మండలంలోని కోటబొమ్మాళి, ఊడికలపాడు, చీపురుపాడులో విద్యుత్‌ బిల్లులు దహనం చేసి సచివాలయ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 4న జిల్లావ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల వద్ద చేపడుతున్న ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు హనుమంతు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం నగరంలోని కొన్నావీధి సచివాలయం వద్ద చేపట్టిన ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, టి.తిరుపతిరావు, ఎం.గోవర్థనరావు తదితరులు పాల్గొన్నారు.
మందస మండలంలోని మందస, భైరిసారంగపురం సచివాలయాల వద్ద చేపట్టిన ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు, పి.దేవేంద్ర, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రణస్థలం మండలంలోని జె.ఆర్‌.పురం సచివాలయం వద్ద ధర్నా అనంతరం కార్యదర్శి ఎల్‌.ఆదినారాయణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వెలమల రమణ, సిహెచ్‌.అమ్మన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
మెళియాపుట్టి మండలంలోని చాపర సచివాలయం వద్ద ధర్నా అనంతరం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె.సూరయ్య, పోలాకి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సచివాలయం వద్ద చేపట్టిన ధర్నాలో సిపిఎం నాయకులు పి.తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సరుబుజ్జిలి మండల కేంద్రంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె.నాగమణి, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి సచివాలయం వద్ద ధర్నా అనంతరం విఆర్‌ఒ శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్‌ ఎన్‌.మోహనరావు, నాయకులు టి.భాస్కరరావు, డి.భానుమతి, బి.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
టెక్కలి మండలం తొలుసూరుపల్లిలో చేపట్టిన కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎన్‌.షణ్ముఖరావు, కొల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
పలాస మండలంలోని కాశీబుగ్గ సంత మైదానంలోని సచివాలయం వద్ద ధర్నా అనంతరం సచివాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి ఎన్‌.గణపతి, జి.గోవింద్‌, ఎన్‌.ఢిల్లేశ్వరి, జె.భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు మండలంలోని మెట్టూరు సచివాలయంలో ధర్నా చేపట్టారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నిమ్మక అప్పన్న, సవర నారాయణ తదితరులు పాల్గొన్నారు.
గార మండలం బూరవల్లిలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గంగరాపు సింహాచలం తదితరులు పాల్గొన్నారు.