Sep 02,2023 00:55

ప్రజాశక్తి-యంత్రాంగం అధిక ధరలు, నిరుద్యోగం, విద్యుత్‌ ఛార్జీలకు వ్యతిరేకంగా సిపిఎం చేపట్టిన సమరభేరి ప్రచారం కొనసాగుతోంది. శుక్రవారం సచివాలయాల వద్ద ధర్నాలు చేపట్టారు. వినతిపత్రిలు అందించారు. కాకినాడ జగన్నాథపురం 23వ డివిజన్‌లో కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. కె.సత్తిరాజు, దుంపల ప్రసాద్‌, మలకా వెంకట రమణ, సిపిఎం నగర కన్వీనర్‌ పలివెల వీరబాబు, నాయకులు కె.నాగజ్యోతి, కె.సత్తిబాబు, పి.రమేష్‌, జివివి పాల్గొన్నారు. సెప్టెంబర్‌ 3న ఉదయం కాకినాడ సుందరయ్య భవన్‌లో నిరుద్యోగుల సమావేశం నిర్వహిస్తున్నట్టు పలివెల వీరబాబు తెలిపారు. కాకినాడ రూరల్‌ మండలం తూరంగిలో సచివాలయాల్లో వినతిపత్రాలు ఇచ్చారు. పార్టీ నాయకులు చింతపల్లి అజరు కుమార్‌, టి.రాజా మాట్లాడారు. తూరంగిలో బుల్లిఅబ్బాయిరెడ్డి కాలనీ నుంచి వచ్చే వాటర్‌ ట్యాంక్‌ ఫిల్టర్లు పాడైపోవడంతో మురుగునీరు వస్తోందన్నారు. కటారి పద్మనాభం, సిహెచ్‌.భవాని, దుర్గ, అప్పలరాజు, సుబ్బలక్ష్మి, కె.శ్రీను, ఎస్‌.కె పరజన, డి మంగ, శివ కుమార్‌ పాల్గొన్నారు. తాళ్లరేవు మండలంలోని పలు సచివాలయాల్లో వినతిపత్రాలు ఇచ్చారు. పార్టీ జిల్లా నాయకులు కెఎస్‌.శ్రీనివాస్‌, నాయకులు టి.ఈశ్వరరావు, బి.రాజబాబు, ఎం.తణుకు రాజు, ఎం.త్రిమూర్తులు, డి.మాలయ్య, మరియమ్మ, సుబ్బరాజు, అన్నవరం పాల్గొన్నారు. పెద్దాపురం సినిమా సెంటర్లో విద్యుత్‌ బిల్లులు దగ్ధం చేశారు. పలు సచివాలయాల వద్ద, మండల పరిధిలోని ఆనూరు, కాండ్రకోట, దివిలి, చంద్రమాంపల్లి గ్రామ సచివాలయాలు వద్ద ధర్నాలు నిర్వహించారు. అనంతరం సచివాలయాల అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు, సిరపరపు శ్రీనివాస్‌, కేదారి నాగు, చింతల సత్యనారాయణ, మాగాపు నాగు, నీలం శ్రీను, కరణం అప్పారావు, యాసలపు రమేష్‌, డి.కృష్ణ, ఆర్‌.వీర్రాజు, కె.అప్పన్న, మేడిశెట్టి గంగాధర్‌, రవి శివ పాల్గొన్నారు. పిఠాపురం ఇందిరా నగర్‌ సచివాలయం వద్ద చేపట్టిన ధర్నాలో సిపిఎం నాయకులు కె.చిన్న, కె.రాజు మాట్లాడారు. నాయకులు కె.నాగేశ్వరరావు, శ్రీరామదాసు గంగన్న, పి.సూర్యనారాయణ, కొడమంచిలి అప్పన్న రమణ, రాజేష్‌, అప్పారావు, రాజు పాల్గొన్నారు. కాజులూరు మండలం చేదువాడ గ్రామపంచాయతీ వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఎం నాయకులు వల్లు రాజబాబు మాట్లాడారు. కురుపూడి భూచక్రం, మేడిశెట్టి మేరీ, జి.అనంతలక్ష్మి, జి.కృపావతి, ఉబ్బన వరలక్ష్మి, జి.మణి, కె.రాజు, సల్ల సత్యనారాయణ, మాతా రామకృష్ణ పాల్గొన్నారు.