
ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రచారభేరి లో భాగంగా మంగళగిరి మండలం ఆత్మకూరు సచివాలయం వద్ద శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని బిజెపి హామీనిచ్చిందని, అధికారానికి వచ్చిన తర్వాత ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పైగా ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి ఉన్న ఉద్యోగాలను తొలగిస్తూ కార్మికుల పొట్ట కొడుతోందన్నారు. పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యుడిని బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్యాస్‌ను రూ.1200 చేసి రూ.200 తగ్గించి గొప్పలు చెప్పుకుంటున్న తీరు చూస్తుంటే 'దారిదోపిడి చేసి దారి ఖర్చులకు చిల్లర ఇచ్చినట్లు ఉంది' అని విమర్శించారు. నిత్యావసర వస్తువులను కృత్రిమ కొరత సృష్టించి ధరల పెరుగుదలకు కారణమైన కార్పొరేట్ సంస్థలపై దాడులు చేయించకుండా వారి ప్రయోజనాలను కాపాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి అధికారానికి రాకముందు తాను అధికారానికి వస్తే కరెంటు చార్జీలు పెంచబోము అని చెప్పి ఇప్పుడు వివిధ రూపాల్లో ఏడుసార్లు పెంచారని తెలిపారు. మరోవైపు చెత్త పన్ను పేరుతో కార్పొరేషన్ అధికారులను ఉసిగొలిపి పేదల శ్రమను దోస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోపిడీకి నిరసనగా జరిగే పోరాటాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని, మండల కార్యాలయాల వద్ద 4వ తేదీన జరిగే ధర్నాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. మాజీ వైఎస్ ఎంపిపి ఎం.పకీరయ్య మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా చెత్తకు పన్ను వసూలు చేస్తున్న ప్రభుత్వం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్‌లోని వైసిపి ప్రభుత్వమేనన్నారు. వాలంటీర్ల ద్వారా ఏడాది పన్ను మొత్తం వసూలు చేయిస్తున్నారని, పన్ను చెల్లించకుంటే సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. చెత్త పన్ను వసూలు చేయొద్దని ఎమ్మెల్యే చెప్పిన అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఎవరూ చెత్తపన్ను చెల్లించొద్దని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు యు.దుర్గారావు, సిహెచ్.జనార్ధనరావు, వి.సాంబశివరావు, పి.ప్రసాదు కె.ఆంజనేయులు, జి.అజరుకుమార్, డి.పద్మనాభశర్మ, సిహెచ్.సీతారామాంజనేయులు, బి.రాంబాబు, వి.రామా రావు, సిహెచ్.గిరిధరరావు, వి.సుబ్రహ్మణ్యం, జి.లక్ష్మి, వి.సురేష్, కె.లక్ష్మి, ఎం.శ్రీను, స్థానికులు పాల్గొన్నారు
చిన్నకాకానిలో ప్రచారం నిర్వహించగా సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు మాట్లాడారు. లాభాల్లో నడుస్తున్న ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ఆదాని అంబానీలకు అప్పచెబుతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కస్టమర్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో విపరీతమైన భారాలు వేస్తున్నరని తెలిపారు. మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెత్త పన్ను విపరీతంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, చెత్త పన్ను రద్దు చేయాలని, కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కార్యాలయం వద్ద 4వ తేదీన జరిగే ధర్నాకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు కె.శివశంకరరావు, కె.సాంబశివరావు, పి.సుబ్బారావు పాల్గొన్నారు. బాబూజీ నగర్‌లో కరపత్రాలు పంపిణీ చేశారు. సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు ఎం.భాగ్యరాజ్ మాట్లాడారు.
ప్రజాశక్తి మంగళగిరి : చెత్త పన్నును ఎత్తివేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం పాత మంగళగిరి 15వ వార్డు సచివాలయంలో వినతిపత్రం అందజేశారు. సిపిఎం పట్టణ కార్యదర్శి వై.కమలాకర్ మాట్లాడారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లేసుకుని నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలివ్వాలని, డిమాండ్ చేస్తూ సచివాలయ అడ్మిన్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఎస్.కోటేశ్వరరావు, డి.జనార్ధన్, డి.గంగాధర్, శివపార్వతి, సుబ్బులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - దుగ్గిరాల : మండల కేంద్రమైన దుగ్గిరాల, చిలువూరు, తుమ్మపూడి, మంచికలపూడి గ్రామాల్లో కార్యదర్శులకు సిపిఎం ఆధ్వర్యంలో వినతిపత్రాలిచ్చారు. తుమ్మపూడిలో తరచూ విద్యుత్ కోతలు విధిస్తున్నారని, విద్యుత్ బిల్లులలు అధికంగా వస్తున్నాయని, నిర్మాణం పూర్తయిన వాటర్ ట్యాంక్‌ను ఉపయోగంలోకి తేవాలని అర్జీలిచ్చారు. దుగ్గిరాలలో గుంతల మయంగా మారిన ప్రధాన రహదారితో పాటు స్థానిక సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జె.బాలరాజు, ఎన్.యోగేశ్వరరావు, ఎం.నాగమల్లేశ్వరరావు, బి.అమ్మిరెడ్డి, జి.శ్రీనివాసరావు, వై.బ్రహ్మేశ్వర పాల్గొన్నారు.
ప్రజాశక్తి - తాడికొండ : స్థానిక సచివాలయంలో అధికారులకు విన్నవించారు. కె.పూర్ణచంద్రరావు, సిహెచ్.భాస్కరరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తెనాలి : పట్టణంలోని 23, 24, 28,27 వార్డు సచివాలయాల అడ్మిన్‌లను కలిసి, సమస్యలు వివరించి, వినతిపత్రాలు ఇచ్చారు. సిపిఎం పట్టణ కార్యదర్శి కె.బాబుప్రసాద్ మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని, దీనికి తోడు విద్యుత్ ఛార్జీలను పెంచేసి ప్రజలపై ప్రభుత్వం భారం మోపిందని అన్నారు. మరోవైపు ఉపాధి అవకాశాలు కొరవడ్డాయన్నారు. ఉపాధి లేక, ధరల భారంతో సతమతమవుతున్న ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు షేక్ హుస్సేన్‌వలి, కె.రవికుమార్, పి.జోనేష్, ఏసోబు, రాజ్యలక్ష్మి, ఎస్‌కె ఆశాభి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పెదనందిపాడు రూరల్ : పెదనందిపాడు, వరగాని, నాగులపాడు సచివాలయాల అధికారులకు సిపిఎం నాయకులు వినతిపత్రాలు ఇచ్చారు. నాగులపాడు గ్రామ కూడలిలో విద్యుత్ బిల్లుల ప్రతులను దహనం చేశారు. సిపిఎం మండల కార్యదర్శి డి.రమేష్‌బాబు మాట్లాడారు. నాయకులు ఎం.వెంకటేశ్వర్లు, కె.వెంకటశివరావు, సిహెచ్.యానాదులు, కె.వెంకట సుబ్బారావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - చేబ్రోలు : ుండల కేంద్రమైన చేబ్రోలులో కరపత్రాలను పంపిణీ చేశౄరు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి.లకీëనారాయణ మాట్లాడారు. మోడీ అధికారంలోకి వచ్చేనాటికి దేశంలో నిరుద్యోగం 4 శాతం ఉంటే నేడు ఏడు శాతానికి పెరిగిందనిన్నారు. కార్యక్రమంలో హనుమంతరావు, అది శేషు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - తుళ్లూరు : స్థానిక గ్రంథాలయం సెంటర్‌లో ప్రచారం చేశారు. సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం.రవి మాట్లాడారు. పి.బాబురావు, కె.వెంకటేశ్వర్లు, బి.శ్రీను, కె.నరేంద్ర పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మేడికొండూరు : మండల కేంద్రమైన మేడికొండూరులో పోస్టర్‌ను ఆవిష్కరించారు. నాయకులు బి.రామకృష్ణ మాట్లాడారు.
ప్రజాశక్తి - ఫిరంగిపురం : పొనుగుపాడు, ఫిరంగిపురంలో ప్రచారం చేశారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎస్‌ఎం వలి, నాయకులు సి.హెచ్. నాగమల్లి మాట్లాడారు. విద్యుత్ బిల్లు ప్రతులను దహనం చేశారు. వై.నాగేశ్వరరావు, వై.కృష్ణమూర్తి, ఎన్.కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, వెంకట్రావు, వెంకట శివ, వెంకయ్య, టి.వీరయ్య పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : తహశీల్దార్ కార్యాలయం వద్ద 4వ తేదీన ధర్నాకు ప్రజలు తరలిరావాలని సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గాదె సుబ్బారెడ్డి కోరారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని పద్మశాలీయ బజార్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. డి.కోదండరామయ్య, యు.వీరాంజనేయులు, కోటి రామ్మూర్తి పాల్గొన్నారు. కొత్తూరులో కరపత్రాలు పంపిణీ చేశారు. డివి భాస్కరరెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. పెనుమాకలో అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం.రవి, ఎస్‌కె పీరూసాహెబ్ పాల్గొన్నారు. ఉండవల్లిలో పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వి.వెంకటేశ్వరరావు, ఎస్.ఇమ్మానుయేలు రాజు, బక్కిరెడ్డి, జి.బోసురెడ్డి, టి.శివయ్య, యు.పార్థసారధి, గాంధీ, కె.రామకృష్ణ పాల్గొన్నారు. 11, 12 సచివాలయాల్లో అర్జీలు అందజేశారు. వి.దుర్గారావు, వెంకన్న, హసీనా, మల్లేశ్వరి, చంటి, సర్దార్, బాబావలి, బేగం, ఇక్బాల్ పాల్గొన్నారు.